Monday, January 20, 2025

నిర్మల్ ఆర్టిసి బస్టాండుకు ఇక కొత్త కల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిర్మల్ టిఎస్ ఆర్టిసి బస్ స్టేషన్‌కు కొత్త కళ రానుంది. ఈ బస్టాండ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు టిఎస్ ఆర్‌టిసి ప్రణాళికలను రూపొందించుకుంది. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో -దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఈ మేరకు టిఎస్ ఆర్టిసి ఛైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నిర్మల్ బస్టాండులో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టిసి అధికారులు ఈడి ఈ వినోద్ కుమార్, సిటిఎం విజయ్ కుమార్ , సీసీఈ రాంప్రసాద్, సివిల్ ఇంజనీర్ మహేష్ ఇతర ఆర్టీసీ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఆర్‌టిసి ఛైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో..నిర్మల్ ఆర్‌టిసి ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌గా నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

టిఎస్ ఆర్టిసి సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు బస్టాండులను ఆధునికరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చూస్తున్నామని, తద్వారా బస్టాండులను కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చి ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. టిఎస్‌ఆర్టిసి నూతనంగా ప్రారంభించిన ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే నిర్మల్ బస్ స్టేషన్ వరకు నడపడం జరుగుతోందన్నారు. అలాగే టిఎస్ ఆర్టిసి ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో నిర్మల్ బస్టాండ్‌ను రూ. 35 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు.

బస్టాండ్‌లను ఆధునికరించడం వల్ల ప్రయాణికులను ఆకట్టుకోవడం , అలాగే ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా టిఎస్‌ఆర్టిసి అందిస్తున్న ప్రత్యేక రాయితీలు పొందాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ సందర్బంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదనపు ఆదాయ వనరులే మార్గంగా టిఎస్‌ఆర్టిసి ప్రత్యేక దృష్టి సాధించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం ఉండాలని ఛైర్మన్ బాజిరెడ్డి అన్నారు.
రూ. 35 కోట్ల వ్యయంతో కమర్షియల్ కాంప్లెక్స్ !
నిర్మల్ బస్టాండ్‌లో రూ. 35 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్‌ను ఆర్‌టిసి నిర్మించబోతోంది. 1.3 ఎకరాలలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్ , జి ప్లస్ వన్ నిర్మాణం జరుగనుంది. నిర్మల్ బస్టాండ్‌లో ఈ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఆర్టిసి యాజమాన్యం రూ. 35 కోట్ల నిధులను సమకూర్చుకుంటోంది. అంతే కాకుండా ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌లో శుభకార్యాలు నిర్వహించేందుకు కూడా హాలును ప్రత్యేకంగా నిర్మాణం చేయనున్నారు. బస్టాండ్‌లోని ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఆర్టిసి ప్రయాణికుల కోసం 53 స్టాళ్లను నిర్మిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్స్, మరుగుదొడ్లతో పాటు బస్సుల కోసం వేచి ఉన్న వారికోసం ఎల్సిడి తెరలు కూడా ఏర్పాటు చేయనున్నారు. మరో 10 తరాలకు అడ్వాన్సుగా ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మాణం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News