Saturday, November 23, 2024

ఆ గ్రహం నిండా అగ్ని పర్వతాలే

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భూమి వంటి గ్రహాలు మరెక్కడైనా ఉన్నాయా అని శాస్త్రవేత్తలు నిర్విరామంగా పరిశోధిస్తున్నారు. ఈ నేపధ్యంలో సౌర వ్యవస్థ అవతల మరో కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. దీనికి ఎల్‌పి 79118 డి అని పేరు పెట్టారు. ఇది పరిమాణంలో భూమిలా ఉంది. కానీ పూర్తిగా అగ్ని పర్వతాలతో కప్పబడి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసాకు చెందిన ప్లానెట్ హంటింగ్ ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ , రిటైర్డ్ స్సిట్జర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహాన్ని గుర్తించారు. ఇది మన సౌర వ్యవస్థలో అత్యంత చురుకైన గురుడి ఉపగ్రహాల్లో ఒకటైన అయో మాదిరిగా ఉంది. అయో ఉపగ్రహం కూడా అగ్నిపర్వతాల చర్యలతో అత్యంత క్రియాశీలకంగా ఉంటుంది.

ప్రస్తుతం కనుగొన్న ఈ బాహ్య గ్రహం ఎల్‌పి 79118 డి అయో పోలికతో కనిపిస్తోంది. ఇది భూమికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే కాంతి ఒక సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఏడాదిలో 9.5 ట్రిలియన్ కిలోమీటర్లు, ఈ వేగంతో ప్రయాణిస్తే ఆ గ్రహాన్ని చేరుకోవడానికి 90 ఏళ్లు పడుతుంది. భూమి కంటే 20 శాతం పెద్దదిగా ఉన్న ఈ గ్రహం ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. దీంతోపాటు మరో రెండు గ్రహాలు కూడా ఈ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ గ్రహాల మధ్య పరస్పర ప్రభావం పడడంతో ఈ గ్రహం కక్ష అండాకారంలోఉంది. దీర్ఘ వృత్తాకార కక్షవల్ల ఈ గ్రహం అత్యధిక వేడిని, అగ్నిపర్వతాల చర్యలను కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News