Monday, January 20, 2025

గీతమ్‌లో నూతన విద్యా విధానం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: అత్యుత్తమ విద్యకు చిరునామాగా పేరెన్నికగన్న గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవ త్సరం నుంచీ (జాతీయ విద్యా విజ్ఞానం- 2020లో భాగంగా) నాలుగేళ్ల డిగ్రీ (హానర్స్) కోర్సులను ప్రారంభి స్తోందని గీతమ్ అడ్మిషన్స్. డైరెక్టర్ డాక్టర్ సి.ఉదయ కుమార్ వెల్లడించారు. శనివారం కరీంనగర్ లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ విద్యార్థులలో అంతర్ విభాగ నైపుణ్యాలను (బహు ముఖ ప్రజ్ఞ) పెంపొందించడంతో పాటు వారి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు ఈ నూతన విధానం ఉపకరిస్తుందని తెలిపారు. నాలుగేళ్ల కోర్సుతో విద్యార్థులకు క్లిష్టమైన సమస్య-పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన, భావ ప్రకటనా (కమ్యూనికేషన్) నైపుణ్యాలతో పాటుగా కళలు (ఆర్ట్), మానవీయ శాస్త్రాలు (హ్యుమానిటీస్), మేనేజ్ మెంట్, సెన్సైలలోని అంతర్ విభాగ పాఠ్యంశాలను మేజర్, మైనర్లగా అభ్యసించవచ్చని తెలియజేశారు.

గీతమ్ కొత్త లిబరల్ ఎడ్యుకేషన్ (ఉదార విద్య) ప్రకారం, విద్యార్థులు బీఏ, బీబీఏ, బీఎస్సీలలో దేనిలో చేరినా మొదటి సెమిస్టర్‌లో అంతా ఒకేరకమైన పాఠ్యాంశాలను అభ్యసిస్తారని తెలిపారు. రెండో సెమిస్టర్‌లో విద్యార్థులు కావాలనుకుంటే ఈ మూడింటిలో ఒకదాని నుంచి మరో కోర్సుకు మారవచ్చన్నారు. బీఏలో ప్రవేశం పొందిన వారు అందులో నుంచి ఎక్కువ పాఠ్యాంశాలతో (60 క్రెడిట్లు) పాటు కొన్ని పాఠ్యాంశాలను (24 క్రెడిట్లు) బీబీఏ లేదా బీఎస్సీ నుంచి కూడా తీసుకోవచ్చని పేర్కొన్నారు. మనదేశంలోని 19 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో సహా 105 వర్సిటీలు ఈ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును 2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాయని, అందులో గీతమ్ కూడా ఒకటని ఆయన వివరిచారు.

గీతం విశాఖపట్నం,హైదరాబాద్,బెంగళూరు ప్రాంగణాలలో ఇంజనీరింగ్,సెన్స్, మేనేజ్ మెంట్, ఫార్మశీ, అర్కిటెక్చర్, బీ- ఆష్టోమెట్రీ, పబ్లిక్ పాలసీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, లా, మెడికల్, సర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ వంటి సృత్తివిద్యా కోర్సులను నిర్వహిస్తోందన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆకర్షణీ యమైన ఉపకార వేతనాలు (గత ఏడాది దాదాపు రూ.23 కోట్ల స్కాలర్‌షిప్‌లు) ఇచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. గీతం ప్రవేశ పరీక్ష (గాట్ -2023) ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్టు అడ్మిషన్స్ టెక్టర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ప్రవేశాల విభాగాధిపతి డాక్టర్ కె.శివకుమార్ సెల్ 9542424256 సంప్రదించాలని, లేదా www.gitam.edu ను సంద ర్శించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ అధ్యాపకులు కృష్ణమోహన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News