- మరింత కాంతి వంతంగా పట్టణ ప్రధాన రహదారులు
- మహానగరాల సరసన మన సిద్దిపేట
- విద్యుత్ దీపాల పనులను ప్రారంభించిన సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు
సిద్దిపేట: సిద్దిపేట పట్టణాన్ని మహా నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా మంత్రి హరీశ్‌రావు సుందరీకరిస్తున్నారని సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సులు అన్నారు. శనివారం సుడా నిధులతో సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్డు, కరీంనగర్ రోడ్డులో ఏర్పాటు చేయనున్న ఎలివేషన్ లైట్ల పనులను కమిషనర్ సంపత్‌కుమార్ , కౌన్సిల్ సభ్యులతో కలిసి కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో మాత్రమే కనబడే పుట్‌పాత్ ఎలివేషన్ లైట్లను సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెదక్ రోడ్డులో లైట్ల ఏర్పాట్ల కోసం కోటి 50 లక్షల రూపాయులు, రోడ్డులో కోటి రూపాయల సుడా నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సుందరికరణ పనులను మరోక నెల రోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. సుందరీకరణ కోసం సుడా నిధులు కేటాయించినందుకు సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పాలక వర్గానికి ,మున్సిపల్ పాలక వర్గం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు సుందర్, నాగరాజురెడ్డి, సాయి ఈశ్వర్ గౌడ్, లక్ష్మన్, మల్లికార్జున్ నాయకులు ఆనంద్, తిరుమల్‌రెడ్డి, మేర సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.