Tuesday, November 5, 2024

ఈ రద్దు రైతుల పట్ల గౌరవంతోనేనా!

- Advertisement -
- Advertisement -

Farmers Concern Timeline Against Three Farm Laws

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా ఆందోళన చేస్తున్న రైతులను బిజెపి నాయకులు ‘జాతి వ్యతిరేక శక్తులు’గా అభివర్ణించాయి. ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయించినట్టు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం ద్వారా బిజెపికి రైతుల పట్ల అపారమైన గౌరవం ఉన్నట్టు ప్రదర్శించారు. “ఈ వ్యవసాయ చట్టాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయని రైతులందరికీ నచ్చచెప్పలేకపోయాం” అంటూ దీని వల్లనే ఈ చట్టాలను ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించారు..
ఈ చట్టాలను ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించడానికి కాస్త ముందు కూడా రైతులకు నచ్చచెప్పాలన్న ఆలోచన ప్రధాని మాటల్లో ఎక్కడా కనిపించలేదు. ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో, ఇతర రాష్ట్రాలలో రైతులు గొంతెత్తిన సందర్భంగా బిజెపి నాయకులు వారిని రెచ్చగొట్టారు, ఎదురుదాడి చేశారు, బెదిరించారు. ఆందోళన చేస్తున్న రైతులకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు చేసిన 12 వ్యాఖ్యానాల జాబితా ను గమనిస్తే అవి మోడీ ప్రకటనకు భిన్నంగా ఉన్నాయి. ‘స్వార్ధ ప్రయోజనాల’తోనే వీరు ఆందోళన చేస్తున్నారని, ఆందోళన చేస్తున్న వీరు అసలు రైతులే కాదని ఆందోళన చేస్తున్న రైతుల గౌరవాన్ని తగ్గించేలా ఈ వ్యాఖ్యానాలున్నాయి. ఈ వ్యాఖ్యానాలు సమగ్రం కాకపోయినప్పటికీ, రైతుల ఆందోళనపైన బిజెపి నాయకుల సహజ ధోరణి ఎలా ఉందో తెలుసుకోవడానికి దోహదం చేస్తాయి.
1.“మిమ్మల్ని సరిచేయడానికి రెండు నిమిషాలు పట్టదు”: అజయ్ కుమార్ మిశ్రా
“నన్ను ఎదుర్కోండి చూద్దాం. మిమ్మల్ని సరిచేయడానికి నాకు రెండు నిమిషాలు పట్టదు” అంటూ కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా రైతులకు చేసిన హెచ్చరికలు పతాక శీర్షికకు ఎక్కాయి. “నేను మంత్రిని మాత్రమే కాదు, ఎంపినో, ఎమ్మెల్యేనో మాత్రమే కాదు, ఒక సవాలు తీసుకుంటే వెనక్కి తగ్గే వాడిని కాదని పార్లమెంటేరియన్‌గా నేను ప్రజలకు బాగా తెలుసు. నేనొకసారి సవాలు చేశానంటే పలియా నుంచేకాదు, లఖింపూర్ ఖేరి నుంచి కూడా మీరు వెళ్ళిపోకతప్పదు. లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపై అజయ్ మిశ్రా కుమారుడు అషిష్ మిశ్రా హింసాత్మక చర్యలకు పాల్పడిన తరువాత మంత్రి మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మంత్రి కాన్వాయ్‌లోని ఆయన కుమారుడి కారు ఆందోళన చేస్తున్న రైతులపైకి ఎక్కించిన సందర్భంగా నలుగురు రైతులు మరణించారు. దీనికి బాధ్యుడైన అషిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేయగా, అతని తండ్రి అజయ్ మిశ్రా మోడీ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు.
2.“ఆందోళన చేస్తున్నది టెర్రరిస్టులు. వారి చేతిలో ఖలిస్తాన్ జెండాలున్నాయి”: జస్‌కౌర్ మీనా
రైతులు చేస్తున్న ఆందోళనను నీరుకార్చడానికి బిజెపి నాయకులు వారిని ‘ఖలిస్తాన్’ తీవ్రవాదులతో పోలుస్తూ, వారికి భారత దేశం వెలుపల నుంచి మద్దతు లభిస్తోందని ఆరోపించారు. రాజస్థాన్‌లోని దౌసాకు చెందిన బిజెపి పార్లమెంటు సభ్యుడు జస్కౌర్ మీనా ఆందోళనాకారుల చేతిలో ఎకె47 తుపాకులున్నాయని ఎలాం టి సాక్ష్యం చూపకుండా ఆరోపించారు. “వ్యవసాయ చట్టాలను గమనించండి. ఖలిస్తాన్ జెం డాలతో టెర్రరిస్టులు ఎకె 47 తుపాకులతో కూ ర్చున్నారు చూడండి” అని మీనన్ చేసిన వీడియోను రాజస్థాన్ బిజెపి నాయకులు ట్వీట్ చేశారు.
3.“ఖలిస్థానీయులు..మావోయిస్టులు”:
అమిత్ మాలవ్య, బిజెపి ఐటి సెల్ అధిపతి
బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాలవ్య కూడా ఈ మాటల మంత్రాంగంలోకి దూకాడు. ఆందోళన చేస్తున్న రైతులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో, మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఎలాం టి సాక్ష్యాలు చూపకుండా ఆరోపించాశారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలపడంతో ఆయన ఢిల్లీ నగరాన్ని తగలబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
4. “రైతుల రూపంలో గూండాలు”:
వై సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి
“ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదు గూం డాలు” అని బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఆరోపించారు. నిరసన తెలిపేవారంతా ‘ఖలిస్థాన్ ఉగ్రవాదులు’, ‘జిహాదీలు’ అన్నా రు.
5.“నిరసనను హైజాక్ చేసిన తీవ్రవాదులు”: దుష్యంత్ కుమార్ గౌతవ్‌ు,
బిజెపి జాతీయ కార్యదర్శి
“రైతుల ఆందోళనలో ఖలిస్థాన్, పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు” అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఉత్తరాఖండ్ రాష్ర్ట బాధ్యులు దుష్యంత్ కుమార్ గౌతవ్‌ు ఆరోపించారు. కానీ, అలాంటి నినాదాలు చేసినట్టు ఏ పత్రికలో అచ్చుకాలేదు, ఛానల్‌లో ప్రసారం కాలేదు. “వ్యవసాయ చట్టాలు మొత్తం భారత దేశానికి సంబంధించినవైనప్పుడు వారి ఆందోళన పంజాబ్‌కు మాత్రమే ఎందుకు పరిమితమైంది? ఆందోళన చేస్తున్నవారు ఖలిస్థాన్ జిందాబాద్, పాకిస్థాన్ జిందాబాద్ అని ఎందు కు నినాదాలు చేశారు? దానిని నిరసన అని ఎలా అంటాం? రైతుల ఆందోళనను తీవ్రవాద శక్తులు హైజాక్ చేశాయి. జాతి వ్యతిరేక శక్తులు నినాదాలు చేస్తున్నాయి”? అని గౌతవ్‌ు అన్నా రు.
6. “అవాంఛిత శక్తులు”:
మనోహర్ లాల్ ఖట్టర్
“ఆందోళన చేస్తున్న వారిలో అవాంఛిత శక్తులు బహిరంగంగా ఖలిస్థాన్‌ను సమర్థిస్తున్నాయి” అని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. “ఇందిరా గాంధీని హత్య చేసినప్పుడు నరేంద్ర మోడీని హత్య చేయలేమా” అని నినాదాలు చేశారని పేర్కొన్నారు. ఈ శక్తులను ప్రభుత్వం గమనిస్తోందని అన్నారు.
7.“ఆందోళనను హైజాక్ చేసిన చిన్న చిన్న ముఠాలు”: సుశీల్ కుమార్ మోడీ
చిన్న చిన్న ముఠాలు ఈ ఉద్యమాన్ని హైజాక్ చేశాయని బిజెపి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ రైతు ఆందోళన పై మాటలతో దాడి చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన ద్వారా దేశం లో నిరసన జ్వాలలు రేగడానికి ఈ ముఠానే కారణమని పేర్కొన్నారు. “ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళనలో, షాహీన్ బాగ్‌లో జరిగిన పౌర సవరణ చట్టం వ్యతిరేక ఆందోళనలోనూ ఈ చిన్న చిన్న ముఠాలే ఇలాంటి నినాదాలు చేశాయి” అని సుశీల్ కుమార్ మోడీ ట్వీట్ చేశారు.
8. “అరాచక రూపాన్నిస్తున్న గనియా పందులు” : బి.ఎల్. సంతోష్
తమ సమస్యలపై రైతులు స్వతంత్రంగా వ్యవహరించడానికి బదులు, మేధాపట్కర్, ఆవ్‌ుఆద్మీ పార్టీ నాయకుల కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారని బిజెపి జాతీయ కార్యదర్శి బి.ఎల్. సంతోష్ ఆరోపించారు. “రైతులు తమ ఆందోళనకు అరాచక రూపాన్నిచ్చే గనియా పందులను అనుమతించకూడదు” అని ట్వీట్ చేశారు.
9. “చొరబడ్డ లెఫ్టిస్టులు, మావోయిష్టులు”: పీయూష్ గోయల్
“జరుగుతున్న ఆందోళనలో ఉన్నది నిజానికి రైతులు కాదు. దానిలోకి లెఫ్టిస్టులు, మావోయిస్టులు చొరబడ్డారు” అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. “వాళ్ళు ఆందోళన చేస్తున్నది రైతుల సమస్యల పరిష్కారం కోసం కాదు. ప్రభుత్వం అరెస్టు చేసిన ‘ జాతి వ్యతిరేక శక్తుల’ విడుదల కోసం ఆందోళన చేస్తున్నారు” అని మంత్రి వ్యాఖ్యానించారు. “రైతుల ఉద్యమంగా చెపుతున్నది రైతులకు దూరంగా ఉన్నది. అది దాదాపు లెఫ్టిస్టులు మావోయిస్టు శక్తుల చొరబాట్లతో నిండిపోయింది. చట ్టవ్యతిరేక చర్యలకు పాల్పడడం వల్ల జైల్లో పెట్టిన వారిని విడుదల చేయాలని వారు కోరడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం” అని పేర్కొన్నారు.
10. “తప్పుడు రూపకల్పన”:
రవి శంకర్ ప్రసాద్
రైతుల ఆందోళనను తగ్గించడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇతర బిజెపి నాయకులతో గొంతు కలుపుతూ, రైతుల ఉద్యమాన్ని చిన్నచిన్న ముఠాలు స్వాధీనం చేసుకున్నాయని అన్నారు. తప్పుడు రూపకల్పన చేసేవారు దీనిలోకి ప్రవేశించారు. అందుకే రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాని వ్యాఖ్యానించారు.
11. “ఆందోళన వెనుక చైనా, పాకిస్థాన్‌”: రావూసాహెబ్ దన్‌వే
“ఆందోళన చేస్తూ రోడ్లెకి వస్తున్నది నిజానికి రైతులు కాదు” అని మరొక కేంద్ర మంత్రి రావూసాహెబ్ దన్‌వే ఆరోపించారు. “ఇప్పుడు జరుగుతున్న ఆందోళన రైతులు చేసేది కాదు. దీని వెనుక చైనా, పాకిస్థాన్ దేశాలున్నాయి. తొలుత ముస్లింలు పట్టుబడ్డారు. వాళ్ళేం చెప్పారంటే, ‘జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సి) వస్తోంది, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వస్తోంది. ఆరు నెలల్లో ముస్లింలు ఈ దేశాన్ని వీడి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక్క ముస్లిం అయినా బతకగలుగుతాడా?’ ఆ మాటలను నమ్మలేదు. నమ్మితే రైతులు నష్టపోతారని నచ్చ చెప్పాం. ఇది విదేశస్థుల కుట్ర” అని అన్నారు.
12. “చక్కగా రూపొందించిన కుట్ర”:
మనోజ్ తివారి
ఢిల్లీ బిజెపి ఎంపి మనోజ్ తివారి ‘చిన్న చిన్న ముఠాలు’ అన్నదగ్గర ఆగలేదు. రైతుల ఆందోళన “చక్కగా రూపొందించిన కుట్ర” అన్నారు. “జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సి)ను, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) షాహిన్ బాగ్‌లో వ్యతిరేకించిన వ్యక్తులు, ముఠాలు షాహిన్ బాగ్ 2లో రైతుల ఆందోళనను ఆసరాచేసుకుని దేశంలో అశాంతిని రూపొందించాలని చూస్తున్నారు” అని ఆరోపించారు. రైతుల ఆందోళనను తగ్గించడానికి బిజెపి కానీ, దాని మద్దతుదారులు కానీ చేయవలసిందంతా చేశా రు. అయినా రైతులు దానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. వారు తమ కోర్కెలపైనే నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

(‘ద వైర్’ సౌజన్యంతో)

రాఘవశర్మ
9493226180

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News