ఇతర వృత్తి విద్యా కోర్సుల
ఫీజులు పెరిగే అవకాశం
కళాశాలల ఆదాయ వ్యయాలు
సమీక్షించి ఫీజులను ఖరారు
చేయనున్న టిఎఎఫ్‌ఆర్‌సి
వచ్చే మూడేళ్ల వరకు అమలు
కానున్న కొత్త ఫీజులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం లో ఇంజనీరింగ్, ఫార్మసీ,మేనేజ్‌మెంట్, న్యాయవిద్య, ఉపాధ్యాయ విద్యతో ఇత ర వృత్తి కోర్సులకు ఈసారి కొత్త ఫీజులు అమలులోకి రానున్నాయి. రాష్ట్రంలో వృ త్తి విద్యా కోర్సులకు గత మూడేళ్ల క్రితం అమలు చేసిన ఫీజుల కాలపరిమితి 20 2425తో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో 2025-26 నుంచి 2027-28 వరకు అమలు కానున్న వృత్తి విద్యా కోర్సుల ఫీ జులను ఈసారి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఖరారు చేయనున్నది. మూడేళ్ల కు ఒకసారి టిఎఎఫ్‌ఆర్‌సి ఫీజులను స మీక్షించి కొత్త ఫీజులను ఖరారు చే స్తుం ది. ఈ మేరకు 2022-23, 2023 -24, 2024-25 విద్యాసంవత్సరాలకు కమిటీ సిఫార్సుల మేరకు 2022 జులైలో ఫీజులను ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
కాగా, 2025-26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉంది. కళాశాలల్లో మౌలిక వసతులు, అధ్యాపకుల వేతనాలతో కూడిన ఆదాయ, వ్యయాలను పరిగణలోకి తీసుకుని టిఎఎఫ్‌ఆర్‌సి ఫీజులను ఖరారు చేస్తుంది. ఇప్పుడు టిఎఎఫ్‌ఆర్‌సి ఖరారు చేసే ఫీజు వచ్చే మూడేళ్లకు అమలవుతుంది. ద్రవ్యోల్బణం ఆధారంగా ఫీజుల పెంపు ఉండే అవకాశం ఉంది. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రైవేట్ యాజమాన్యాలు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. మూడేళ్ల క్రితంతో పోల్చితే వృత్తి విద్యా కళాశాలల నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రతి కోర్సులో కొంత మేర పెంపు తప్పనిసరిగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు.
కౌన్సెలింగ్ ప్రారంభం నాటికి ఫీజులు ఖరారు చేసేలా చర్యలు
వృత్తి విద్యా కోర్సులకు జూన్ లేదా జూలైలో కౌన్సెలింగ్ చేపట్టే అవకాశం ఉన్నందున ఆ సమయానికే ఫీజులను ఖరారు చేసేలా టిఎఎఫ్‌ఆర్‌సి చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో కొన్ని కాలేజీల్లో ఫీజు రూ. లక్షకుపైగా ఉండగా, మిగతా కాలేజీల్లో రూ. లక్షలోపు ఉంది. ఈసారి 15 శాతం మేర ఫీజులు పెంచాలని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకు టిఎఎఫ్‌ఆర్‌సీ ఆమోదం తెలిపితే ఇంజనీరింగ్‌లో వార్షిక ఫీజు కనిష్ఠంగా రూ. 60 వేల నుంచి రూ. 1.70 లక్షలకుపైగా ఉండే అవకాశం ఉన్నది. అంటే ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయడానికి రూ. 3 లక్షల నుంచి రూ. 8 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజుల ఖరారుకు గత మూడేళ్లలో కాలేజీల నిర్వహణ వ్యయంతోపాటు మౌలిక సదుపాయాల విస్తరణ,
విద్యాప్రమాణాల మెరుగుదలకు చేసిన ఖర్చు వివరాలను యాజమాన్యాలు టిఎఎఫ్‌ఆర్‌సీకి ఇవ్వాలి. యాజమాన్యాలు సమర్పించిన కాలేజీల ఆదాయ వ్యయాల ఆధారంగా టిఎఎఫ్‌ఆర్‌సీ ఫీజులు ఖరారు చేస్తుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, న్యాయవిద్య, ఉపాధ్యాయ విద్య తదితర వృత్తి విద్యా కోర్సులకు వచ్చే మూడేళ్లపాటు అమలు చేయాల్సిన ఫీజుల ఖరారుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) షెడ్యూల్ విడుదల చేసింది. కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన కళాశాలల ఆదాయ వ్యయాలను పరిశీలించి టిఎఎఫ్‌ఆర్‌సీ ఫీజులను ఖరారు చేయనున్నది.