Monday, December 23, 2024

పురుషుల్లో వ్యంధత్వానికి వీలు కల్పించే కొత్త జన్యువు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పురుషుల్లో సంతాన నిరోధానికి ( వ్యంధత్వానికి )వీలు కల్పించే కొత్త జన్యువును బహుళ క్షీరద జాతుల్లో శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. అమెరికా లోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ (డబ్లుఎస్‌యు)కు చెందిన పరిశోధక బృందం ఎలుకలు, పందులు, గొర్రెలు, మానవుల్లో గల వృషణాల్లో ఎఆర్‌ఆర్ డిసి 5 అనే కొత్త జన్యువును కనుగొనగలిగారు. ఈ జన్యువును ఎలుకల్లో ప్రయోగించగా, మగ ఎలుకలో మాత్రం వ్యంధత్వం సంప్రాప్తించింది.

Also Read : రెండో రాజధాని వెనక కుట్ర

వాటి వీర్యకణాలు, చలనంపై ప్రభావం చూపించింది. “ ఈ పరిశోధనలో గుర్తించిన జన్యువు మొట్టమొదటిసారి వృషణాల్లోనే బయటపడింది తప్ప శరీరంలో మరే భాగం లో కనిపించలేదని, అదీ బహుళ క్షీరద జాతుల్లోనేనని పరిశోధకులు ప్రొఫెసర్ జోన్ ఓట్లే పేర్కొన్నారు. ఈ జన్యువును నిష్క్రియగా మార్చినా లేదా మగవారిలో చొప్పించినా, అవి వీర్యాన్ని అండాన్ని ఫలధీకరణం చేయనీయవని , అదే పురుషుల్లో వ్యంధత్వ అభివృద్ధికి ప్రధాన లక్షమవుతుందని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News