- Advertisement -
బాలాసోర్: కొత్త తరం ఆకాశ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా చాందీపూర్‌లోని ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం మధ్యాహ్నం జరిపిన ఆకాశ్‌ఎన్‌జి క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి అని తెలిపారు. గగనతలంలో శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వైమానిక దళం ఈ క్షిపణులను వినియోగించనున్నది. డిఆర్‌డిఒ, బిడిఎల్, బిఇఎల్ పరిశోధకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు వైమానికదళ ప్రతినిధులు హాజరయ్యారు. పరిశోధకుల బృందానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందనలు తెలిపారు.
- Advertisement -