Wednesday, January 22, 2025

విజయవంతంగా “అగ్ని ప్రైమ్” విధ్వంసక క్షిపణి పాటవ పరీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: నూతన శ్రేణి విధ్వంసక క్షిపణి అగ్ని ప్రైమ్ పాటవ పరీక్షను డిఆర్‌డిఓ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా సముద్ర తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి విధ్వంసక క్షిపణి అగ్ని ప్రైమ్ పాటవ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు గురువారం ప్రకటించారు.

అగ్ని ప్రైమ్ విధ్వంసక క్షిపణి ఇప్పటికే మూడుసార్లు పాటవ పరీక్షలు నిర్వహించగా మొట్టమొదటిసారి రాత్రి వేళ ఈ క్షిపణి పాటవ పరీక్షను నిర్వహించినట్లు ఆ అధికారి చెప్పారు. అగ్ని ప్రైమ్ సామర్ధాన్ని పూర్తిగా అంచనా వేసిన అనంతరం దీన్ని రక్షణ రంగంలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆ అధికారి వివరించారు.

ఈ క్షిపణి గ్రమనాన్ని పరిశీలించేందుకు వివిధ ప్రదేశాలలో రాడార్, టెలిమెట్రి, ఎలెక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రయోగ స్థలి వద్ద రెండు దిగువ శ్రేణి నౌకలను కూడా ఉంచినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News