Thursday, January 23, 2025

కెసిఆర్ పాలనలో దేవాలయాలకు నూతన వైభవం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కోనరావుపేట: తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు నూతన వైభవం వచ్చిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో నూతన దేవాలయ ప్రారంభం,సీతారాముల కల్యాణ మహోత్సవంలో కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. నాగారం గుట్టపై నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని ఆయన ప్రారంభించారు. దేవాలయంలో నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ,కల్యాణ మహోత్సవంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని,రమేష్ బాబు,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్,రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పి చైర్మన్ న్యాలకొండ అరుణతో కలిసి ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ ముఖ్యమంత్రిగా, తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల, మతాలను గౌరవిస్తూ, వారిని అభివృద్ధి చేస్తుందని అన్నారు.

దేవాలయాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేవని,తెలంగాణ సర్కార్ వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి దేవాలయాల నిర్మాణాలు, పూజరులకు గౌరవేతనం ఇవ్వడంతో రాష్ట్రంలో నూతన వైభవం వచ్చిందన్నారు. కోనరావుపేట మండలంలోని నాగారం దేవలయంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, రాబోయే రోజుల్లో ఈ గుట్ట ప్రాంతం మంచి, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుతుందని, దానికి అన్ని విధాలా మేము సహకరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం,పెద్ద ఎత్తున భక్తులు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం సీతారాముల దేవాలయ కమిటీ, ఎంపిపి ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్,సర్పంచ్ బాస.లావణ్య శ్రీనివాస్,పవర్లుమ్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి.ప్రవీణ్,సెస్ చైర్మన్ చిక్కాల.రామారావు,వేములవాడ అర్డిఓ పవన్ కుమార్,రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య,మున్సిపల్ చైర్మన్ రామతిర్తపు మాధవి,వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత,సెస్ వైస్ ఛైర్మన్ దేవరకొండ తిరుపతి,బారాస మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య,సర్పంచుల ఫోరమ్ గోపు పర్సరాములు,మాజీ జడ్పిటిసి శ్రీకుమార్,సర్పంచులు,ఎంపిటిసిలు,నాయకులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News