Monday, December 23, 2024

ఎపికి చేరుకున్న కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి చేరుకున్నారు. బుధవారం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు సిఎం జగన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌తో పాటు రాష్ట్ర మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ మోషన్ రాజు, డిజిపి రాజేంద్రనాథ్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.

అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ నజీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఈనెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నజీర్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News