Sunday, December 22, 2024

మార్చి 2న పాక్‌లో కొత్త ప్రభుత్వం?

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్థాన్ ముస్లిం లీగ్‌నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య అధికార పంపిణీకి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 2 నాటికి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 9లోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందుతున్నాయి. గతంలో మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్‌నవాజ్ కు మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మద్దతు ఇస్తోంది. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పదవిని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెహబాజ్‌ను ప్రధాని పదవికి నామినేట్ చేయాలని ఆయన అన్నయ్య అయిన నవాజ్ నిర్ణయించారు.

పార్లమెంట్‌లో తమ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ లేనందున ప్రభుత్వాన్ని నడపడానికి నవాజ్ సుముఖంగా లేనట్టు పార్టీ వర్గాలు రెండు పార్టీలు ఇమ్రాన్‌ఖాన్ మద్దతు గల అభ్యర్థుల కంటే తక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకున్నాయి. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలు ఈ నెల 29న ప్రమాణం చేస్తాయని, రెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అంచనాగా న్యూస్ ఇంటర్నేషనల్ తెలిపింది. తొమ్మిదో తేదీ లోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News