ఊబకాయంతో బాధపడుతున్న బాలలు వేగంగా తెలుసుకుని వైద్య చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. 12 ఏళ్ల బాలలు వైద్యం ద్వారా మందులు తీసుకోవాలని, 13 ఏళ్లు దాటిన వారు అవసరమైతే సర్జరీ చేయించుకోవాలని కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. సుదీర్ఘకాలం జాగరూకతతో వేచి ఉండే అలవాటు లేదా ట్రీట్‌మెంట్‌లో ఆలస్యం చేయడం ప్రమాదకరం. స్వయంగా వారి ఇష్టానుసారం స్థూలకాయులు కావడం, లేదా ఊబకాయాన్ని అధిగమించడం అంటే పరిస్థితి మరింత అధ్వాన్నమౌతుంది తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
ఈ విధమైన దుస్థితితో అమెరికాలో 14.4 మిలియన్ మంది కన్నా ఎక్కువ మంది సతమతమౌతున్నారు. ఎలాంటి చికిత్స అందించకుండా ఊబకాయాన్ని విడిచిపెడితే జీవితాంతం రక్తపోటు, కుంగుబాటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడవలసి వస్తుంది. ఊబకాయులైన పిల్లలు, టీనేజీలు ఏ వయసులో మందులు తీసుకోవాలో, ఏ వయసులో శస్త్రచికిత్సలు చేయించుకోవాలో సూచించే మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సాధారణంగా ఊబకాయులైన 12 ఏళ్లు దాటిన బాలలకు మందులతో చికిత్సకు వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.
13 ఏళ్లు దాటిన టీనేజీలకు బరువు తక్కువ చేసే శస్త్రచికిత్స అవసరమని సూచిస్తుంటారు. యువతలో ముఖ్యంగా పిల్లల్లో ఎవరికైనా బాడీమాస్ సూచిక ( బిఎంఐ) 95 శాతం దాటితే ఊబకాయంగా పరిగణిస్తారు. అదే 120 శాతం దాటితే తీవ్ర స్థూలకాయంగా గుర్తిస్తారు. శరీరం ఎత్తు బరువును బట్టి బాడీ మాస్ ఇండెక్స్ ఉంటుంది. అమెరికాలో పిల్లలు, టీనేజీల్లో 20 శాతం, పెద్దల్లో 42 శాతం వరకు ఊబకాయం కనిపిస్తోంది.
కొత్త ఔషధంతో చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో వెగోవీ (wegoy) అనే ఇంజెక్సన్ కొత్తగా తెరపైకి వచ్చింది. వారానికి ఒకసారి ఈ ఇంజెక్షన్‌ను తీసుకోవలసి ఉంటుంది. 12 ఏళ్లు లేదా అంతకంటే వయసు ఎక్కువైన బాలలకు ఈ ఇంజెక్షన్ వాడాలని వైద్యులు కొత్తగా సూచిస్తున్నారు.