Monday, December 23, 2024

నాలుగేళ్ల చిన్నారికీ హెల్మెట్

- Advertisement -
- Advertisement -
New helmet rule for children below 4 years
కేంద్రం మరో కొత్త నిబంధన

హైదరాబాద్ : ద్విచక్ర వాహనదారులకు ముఖ్య గమనిక. కేంద్రం మరో కొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి బండి మీద 9 నెలల నుంచి 4 ఏళ్ల మధ్యన్న పిల్లలను తీసుకెళ్త్తున్నప్పుడు వారు కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాల్సిఉంటుంది. తాజాగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 9 నెలల నుంచి 4 ఏళ్ల మధ్య -వయసున్న పిల్లలు కూడా ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో వారికి సరిపడే హెల్మెట్‌ను ధరించాలి. లేకపోతే రూ.1,000 జరిమానా లేదా డ్రైవర్ లైసెన్స్’ను మూడు నెలల వరకు సస్పెన్షన్ చేయనున్నారు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989కు సవరణ చేసి ఈ కొత్త నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది. నాలుగు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలను ద్విచక్ర వాహనంమీద తీసుకొని వెళ-్తన్నప్పుడు వాహనం గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది అని కూడా పేర్కొంది.

ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నప్పుడు పిల్లల భద్రత దృష్ట్యా హార్నెస్, హెల్మెట్ -ఉపయోగించడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ప్రతిపాదించింది. ఈ విషయంపై పౌరుల అభిప్రాయాన్ని అడగడానికి అక్టోబర్ 2021లో ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ద్విచక్ర వాహనంపై పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు వారి భద్రత కోసం ఈ మార్గదర్శకాలను తప్పక పాటించాలని మంత్రిత్వశాఖ పేర్కొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై పిల్లల్ని తీసుకువెళ్లాలంటే వారికి సేఫ్టీ బెల్ట్ తప్పనిసరిగా -ఉండాలి. అది కూడా చాలా తక్కువ బరువుతో వాటర్ ప్రూఫ్ అయి -ఉండాలి. 30 కేజీల బరువును మోసే సామర్థ్యం దీనికి -ండాలి. ఈ నియమాన్ని అతిక్రమిస్తే చలానా వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలానే పిల్లల హెల్మెట్ల విషయానికి వస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బిఐఎస్) త్వరలోనే ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అప్పటివరకు సైకిల్ హెల్మెట్లను వినియోగించాలని ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News