Wednesday, January 22, 2025

కొత్తగా ఇల్లు కట్టేవారు ముందుగా చెట్లు పెంచాలి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : చల్లటి ఆరోగ్య తెలంగాణకు చెట్లే ముఖ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హరితహారం కార్యక్రమాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం ఆయన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటీ మొక్కలు నాటే కార్యక్రమంలో మహబూబ్‌నగర్ బైపాస్ రహదారిపై మొక్కలు నాటి జిల్లాలో 4,20,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో కనీవిని ఎరుగని రీతిలో కోట్లాది మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకువచ్చారని అన్నారు. దేశంలోనే అత్యధిక మొక్కలు నాటుతున్న రాష్ట్రంగా పార్లమెంట్ వేదికగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు రా ష్ట్రంలో ప్రతి గ్రామంతో పాటు, మున్సిపాల్టీలలో నర్సరీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఈ సంవత్సరం మహబూబ్‌నగర్ జిల్లాలో హరితహారం కింద 55 లక్షల మొక్కలు నాటాలన్నది లక్షంగా నిర్ణయించడం జరిగిందని, అన్ని శాఖల సమన్వయంతో అదే విధంగా ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ ఒక్కరోజే జి ల్లాలో 4 నుండి 5 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించా రు. దేశంలోనే ఇది అతిపెద్ద జంగిల్ సఫారీ కానున్నదని, దీంతో పాటు అతిపెద్ద పక్షుల ఎంక్లోజర్ ఏర్పాటు చేసి 1000 పక్షులను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామని మన్నెంకొండలో రోప్‌వేతో పాటు, ఇతర అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా ఎనిమిది లిప్టుల ద్వారా కొండపైకి వెళ్లే విధంగా ఏర్పా ట్లు చేస్తున్నామని, నియోజకవర్గంలో, జిల్లాలో మంజూరైన పనులు అన్నింటిని ప్రజాప్రతినిధులు దగ్గరుండి పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు.

మున్సిపల్ చై ర్మన్ కేసి నర్సిములు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా రైతుబంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, డిసిసిబి ఇంచార్జ్ అధ్యక్షులు కోరమని వెంకటయ్య, ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ అధ్యక్షులు లయన్ నటరాజ్ , రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావు, డిఎఫ్‌ఓ సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News