Saturday, November 23, 2024

పంచాయతీ కార్యదర్శుల వేతనాల పెంపుతో కొత్త ఉత్సాహం: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

New impetus with increase in salaries of Panchayat Secretaries: Minister Errabelli

 

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా నియామకమైన పంచాయతీ కార్యదర్శుల వేతనాలను, ప్రస్తుతం పనిచేస్తున్న కార్యదర్శుల వేతనాలకు సమానంగా పెంచుతున్నట్లుగా అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ప్రకటించడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల కొత్తగా నియామకమైన 9 వేల 355మంది కార్యదర్శులకు సమాన పనికి సమాన వేతనంగా ఇప్పుడున్న జీతాలకు రెట్టింపుకంటే ఎక్కువ జీతాలు వస్తాయన్నారు.

గత కొంతకాలంగా కొత్త గ్రామ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్న డిమాండ్లు సిఎం హామీతో నెరవేరిందన్నారు. ప్రొబేషనరీ పిరియడ్‌ని 4 ఏళ్ళకు పెంచడానికి గల కారణాలను కూడా సిఎం తెలిపారని, కార్యదర్శులు మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని మంత్రి కోరారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతానికి గ్రామ కార్యదర్శుల పనితనమే కారణమన్నారు. నర్సరీలు, డంపు యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని ఆన్నారు. నిరంతరం పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నందున పారిశుద్ధం కూడా బాగా జరగాలని ఆదేశించారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పారిశుద్ధంలో రాజీ లేకుండా గతంలో మాదిరిగానే, కరోనా కట్టడికి పూర్తి క్రమశిక్షణతో పని చేయాలని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News