Saturday, November 23, 2024

ఖరారు కాని నూతన పారిశ్రామిక విధానం

- Advertisement -
- Advertisement -

కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు కనిపించని స్పష్టత

మన తెలంగాణ / హైదరాబాద్:  గత ఆరు నెలల నుంచి నేటి వరకు పారిశ్రామిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. భూ కేటాయింపుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటు ప్రతిపాదనలపై కనీసం ఆలోచన చేసే నాథుడు కూడా లేడు. ప్రభుత్వం చెబుతున్న పారిశ్రామిక క్లస్టర్లపైనా స్పష్టత లేకపోవడంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పరిస్థితి అయోమయంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిశ్రమల శాఖ డైరెక్టర్ డిప్యూటీ సిఎం వద్ద కార్యదర్శిగా చేరడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. నెల రోజుల తర్వాత ఆ ఖాళీని ఇటీ వలే భర్తీచేశారు. అలాగే టీఎస్‌ఐఐసీ ఎండీని బదిలీచేసి శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు కల్పిం చిన ప్రభుత్వం.. వారం రోజులు తిరక్కుండానే తాజాగా ఆ బాధ్యతలను విష్ణు వర్దన్ రెడ్డికి అప్పగించింది.దీంతో టిఎస్‌ఐఐసి ఎండి పోస్టులో కేవలం నెలరోజుల్లోనే ముగ్గురు మారారు. మరోవైపు వివిధ పారిశ్రామికవా డల్లో భూములు కేటాయించాలని కోరుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన వందల దరఖాస్తులు ఇప్పటికీ పెండిగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రతి వారం సమావేశాలు నిర్వ హించి ఆ దరఖాస్తులను క్లియర్స్ చేయాల్సిన ధికారులు.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకూ సమావేశాలు జరపరాదని నిర్ణ యించినట్లు తెలిసింది. ఫలితంగా రుణాల కోసం బ్యాంకు లను సంప్రదిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవే త్తల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పారిశ్రామిక క్లస్టర్లపై లేని స్పష్టత
పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్రాన్ని మూడ క్లస్టర్‌లుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సిఎం ఫార్మాసిటీని రద్దుచేస్తామని ఒకసారి, రద్దు చేయడంలేదని మరోసారి చెప్పడం గమ నార్హం. దీంతో ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పా టుకు ముందుకొచ్చిన ఔత్సాహికులు అయో మయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం నిజంగానే కొత్త పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలనుకుంటే కేంద్రం నుంచి మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, అది అనున్నంత సులభంకాదని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యా వరణ అనుమతులు లభించేందుకు కనీసం రెండు,-మూడు సంవత్సరాలైన పడుతుందని అధికా రవర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న పారిశ్రామిక క్లస్టర్లపై ఉన్నతాధికారుల్లోనూ స్పష్టత లేదు. వాటి ఏర్పాటు కోసం ఏదైనా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా.. లేక ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని పరిశ్రమలకు కేటాయిస్తారా ? ఆయా కస్లర్‌లను ఏ తరహా పరిశ్రమలకు కేటాయిస్తారు. వాటి విధివిధానాలు ఏమిటి అనేది ఎవ్వరి అంతకు పట్డం లేదు. హైదరాబాద్ నగరం నానాటికి విస్తరిస్తుండంలో ఔటర్ రింగ్ రోడ్డు( ఓఆర్‌ఆర్)కు లోపల ఉన్న కాలుష్య కారిక పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌కు తరలించాలని గత ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయా పరిశ్రమలకు భూముల కూడా కేటాయించింది. తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడంతో పరిశ్రమల తరలింపు ప్రక్రియ ఆగిపోయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరోవైపు టిఎస్‌ఐసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 70 వరకూ కొత్త పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకోసం వివిధ జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ కొన సాగుతుండగానే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. రాష్ట్రంలో వ్యవసాయ దిగు బడులు పెరగడంతో వాటిని ఇక్కడే ప్రాసెస్ చేసి, ఎగుమతి చేయాలన్న ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఫుడ్‌ఆప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో కనీసం 500 ఎకరాలకు తగ్గకుండా మొత్తంగా దాదాపు 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటిలో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దాదాపు 1,400 దరఖాస్తులు రావడంతో పలు జిల్లాల్లో భూసేకరణ, కేటాయింపు కూడా పూర్త యింది. ఆయా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కెసిఆర్ ప్రభుత్వం ప్రత్యేక పాలసీలను రూపొందించి, అమలు చేసింది. కానీ, ఆ పాలసీలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేక కొత్త విధానాలను ప్రవేశపెడుతుందా? అన్నది తెలియడం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News