Monday, December 23, 2024

రాష్ట్రానికి ఆరుగురు ఐపిఎస్‌లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపిఎస్‌లను కేంద్రం కేటాయించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఐపిఎస్ అధికారులు తక్కువగా ఉన్నారని, మరో 29 మందిని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒకేసారి 29మందిని కేటాయించలేమని వెల్లడించారు. విడతల వారిగా కావాల్సిన అధికారులను కేటాయిస్తా మన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆరుగురు ఐపిఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి కేటాయించిన అధికారుల్లో అయేషాఫాతిమా, మంచారే సోహం సునీల్, సాయికిరణ్, మాసన్ భట్టి, రాహుల్ కాంత్, రిత్విక్ సాయి ఉన్నారు. త్వరలోనే రాష్ట్రంలో వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు ఐపిఎస్‌లను కేంద్రం కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News