Saturday, November 23, 2024

రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ 60రోజులకు కుదింపు

- Advertisement -
- Advertisement -

టికెట్ల రిజర్వేషన్లకు ఇప్పుడున్న గడువు కాలం కుదింపును భారతీయ రైల్వే బోర్డు సమర్థించుకుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ల గడువు ఇంతకు ముందు 120 రోజులుగా ఉండేది. దీనిని ఇప్పుడు 60 రోజులకు తగ్గించారు. అత్యధికంగా టికెట్ల రద్దు, బెర్తులు వృధాగా ఉండటం వంటి కారణాలతో ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని రైల్వే శాఖ గురువారం అధికారిక ప్రకటనలో తెలిపింది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నిజానికి 2015 సంవత్సరం వరకూ రైలు టికెట్లకు అడ్వాన్స్ బుకింగ్ కాల పరిమతి 60 రోజులుగా ఉండేది.

అయితే ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆ తరువాత దీనిని 120 రోజుల వ్యవధి వరకూ పెంచారు. అయితే ఇప్పుడు ఇంతకు ముందటి పద్థతికి దిగుతున్నట్లు వెల్లడించారు. రిజర్వేషన్లను దాదాపు నాలుగు నెలల ముందు చేసుకోవడం వల్ల అనేకులు చివరి క్షణాలలో ఇతరత్రా కారణాలతో పర్యటనలు వాయిదా లేదా రద్దు చేసుకోవడం జరుగుతోంది. దీనితో బెర్తులు ఖాళీగా ఉండటం రైల్వేకు వనరుల వృధాగా మారింది. దీనిని సరిదిద్దేందుకు ఇప్పుడీ తిరోగమన నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News