- Advertisement -
శ్రీలంక విదేశాంగ మంత్రిగా మళ్లీ పీరిస్
కొలంబో: శ్రీలంక ప్రధానిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె క్యాబినెట్‌లో నలుగురికి చోటుదక్కింది. కాగా. విదేశాంగ మంత్రిగా జిఎల్ పీరిస్ కొత్త ప్రభుత్వంలోనూ కొనసాగనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రధాని రణిల్ విక్రమసింఘె ప్రస్తుతం క్యాబినెట్ కూర్పు చేపడుతున్నారు. విదేశాంగ మంత్రి పీరిస్, ప్రభుత్వ పాలనా వ్యవహారాల శాఖ మంత్రిగా దినేష్ గుణవర్దన, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రసన్న రణతుంగ, విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కంచన విజెశేఖర శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. విక్రమసింఘె క్యాబినెట్‌లో 20 మందికి మించి సభ్యులు ఉండబోరని ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ డైలీ మిర్రర్ తెలిపింది. మాజీ ప్రధాని మహీంద రాజపక్స ప్రభుత్వంలో కూడా విదేశాంగ మంత్రి పీరిస్ పనిచేశారు.
- Advertisement -