Saturday, February 1, 2025

త్వరలో 120 కొత్త గమ్యస్థానాలకు కనెక్షన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాగల 10 ఏళ్లలో నాలుగు కోట్ల మంది విమాన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్’(ఉడాన్) పథకంను సవరించినట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దీని ద్వారా ప్రాంతీయ ప్రదేశాలకు కనెక్టివిటీ పెరుగనున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 202526 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ బీహార్‌లో ఇందుకుగాను గ్రీన్‌ఫీల్డ్ ఏయిర్‌పోర్ట్‌లను ఫెసిలిటేట్ చేయనున్నట్లు తెలిపారు. ‘ఉడాన్’ ఇప్పటికే 88 విమానాశ్రయాలను దేశంలో కనెక్ట్ చేసింది. పైగా 619 రూట్లలో విమానాలు నడిచేలా వసతి కల్పించింది. మధ్య తరగతికి చెందిన 1.5 కోట్ల మంది ఉడాన్ కారణంగా వేగంగా విమానాల ద్వార ప్రయాణిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో తెలిపారు.

ఉడాన్ స్కీమ్ విజయవంతం కావడంతో కొత్తగా 120 గమ్యస్థానాలకు దానిని విస్తరించబోతున్నారు. దీనివల్ల రాగల 10 ఏళ్లలో నాలుగు కోట్ల మంది విమానాల ద్వారా తమ గయ్యస్థానాలకు చేరుకుంటారు. విమానాల ద్వారా రాకపోకలు చేస్తారు. ఈ పథకం పర్వత ప్రాంతాల వారికి, ఈశాన్య రాష్ట్రాల వారికి చాలా ఉపయోగపడనున్నది. వైమానిక ట్రాఫిక్ డిమాండ్ ఇండియాలో రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోనే ఇండియా సివిల్ ఏవియేషన్ మార్కెట్ బాగా ఊపందుకుంటో ంది. బీహార్‌లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రీన్‌ఫీల్డ్ వైమానిక సౌకర్యాన్ని పెంచబోతున్నారు. ప్రస్తుతం పాట్నా ఎయిర్‌పోర్ట్, బిహ్తాలో ఉన్న బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు ఇది అదనం. ఈ ఏడాది చివర్లో బీహార్ ఎన్నికలు జరుగనున్నాయన్నది ఇక్కడ గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News