Monday, December 23, 2024

రికార్డు సమయంలో కొత్త లోడింగ్ సదుపాయాన్ని అభివృద్ధి చేసిన సికింద్రాబాద్ డివిజన్

- Advertisement -
- Advertisement -
ప్రతిపాదనను స్వీకరించిన 30 రోజులలోపే మాణిక్‌గర్ న్యూ గూడ్స్ షెడ్ వద్ద అదనపు లైన్ పొడిగింపు
కొత్త లోడింగ్ లైన్ నుంచి ఇనుప ఖనిజంతో ప్రారంభమైన మొదటి రేక్

హైదరాబాద్: సికింద్రాబాద్ డివిజన్ రికార్డు సమయంలో కొత్త లోడింగ్ సదుపాయాన్ని అభివృద్ధి చేసింది. ప్రతిపాదనను స్వీకరించిన 30 రోజుల్లోపే మాణిక్‌గర్ న్యూ గూడ్స్ షెడ్ వద్ద అదనపు లైన్‌ను పొడిగించింది. ఈ నేపథ్యంలోనే కొత్త లోడింగ్ లైన్ నుంచి ఇనుప ఖనిజంతో మొదటి రేక్ ప్రారంభమయ్యింది. మాణిక్‌ఘర్ న్యూ గూడ్స్ షెడ్‌లో సరుకు రవాణాను సులభతరం చేయడానికి అదనపు లైన్‌ను సికింద్రాబాద్ డివిజన్ అభివృద్ధి చేసింది.

మానిక్‌ఘర్ స్టేషన్ సమీపంలో సరుకు రవాణా కస్టమర్లకు లోడింగ్‌ను సులభతరం చేయడానికి ఇటీవలే కొత్త ఒక గూడ్స్ షెడ్‌ను దక్షిణమధ్య రైల్వే అభివృద్ధి చేసింది. మానిక్‌ఘర్ స్టేషన్ నుంచి 2.15 కిలోమీటర్ల దూరంలో మానిక్‌ఘర్ న్యూ గూడ్స్ షెడ్ (ఎంఎన్‌ఎస్‌ఎం) 3 మార్చి 2023వ తేదీన సరుకు రవాణా కోసం ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ డివిజన్‌లోని వ్యాపార అభివృద్ధి యూనిట్ (బిడియూ) నిరంతర వ్యాపారాభివృధి కృషి ఫలితoగా ఈ గూడ్స్ షెడ్ నుంచి కొత్త ఇనుప ఖనిజం లోడ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఒక నెలలో సుమారు రూ. 60 కోట్ల సరుకు రవాణా ద్వారా ఆదాయం చేకూరిందని అధికారులు తెలిపారు.
4,083 టన్నుల ఇనుప ఖనిజం రవాణాతో రూ. 63 లక్షల ఆదాయం
బిడియూ బృందం ఈ ప్రాంతంలోని సరుకు రవాణా కస్టమర్‌లతో నిరంతరం సంభాషణలను కొనసాగిస్తూ కొత్త గూడ్స్ షెడ్ నుంచి లోడింగ్‌ను పెంచే అవకాశాలను అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నాల ఫలితంగానే ఇప్పటికే ఉన్న సరుకు రవాణా కస్టమర్లు ఈ స్టేషన్ నుంచి అదనపు సరుకును రవాణా చేయడానికి ప్రతిపాదనను అందించారు. అయితే వేగవంతమైన లోడింగ్‌ను సులభతరం చేయడానికి, స్టేషన్ నుంచి త్రోపుట్‌ను పెంచడానికి అదనపు లోడింగ్ లైన్ ఏర్పాటుకై విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ బృందం వెంటనే అదనపు లైన్ అభివృద్ధి పనులను చేపట్టింది. ఏకకాలంలో రెండు రేక్‌లు ఉండేలా ప్రస్తుత లైన్‌ను మరింత పొడిగించారు. ఫార్మేషన్, బ్యాలస్టింగ్, ట్యాంపింగ్, ట్రాక్ లింకింగ్ వంటి అవసరమైన పనులు నిశితంగా జరిగాయి. ఇంకా సరుకుని లోడ్ చేయడంతో పాటు నిల్వను సులభతరం చేయడానికి లోడింగ్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసింది. నూతన మౌలిక సదుపాయాల కల్పనతో, డివిజనల్ బిడియూ బృందం ప్రయత్నంలో భాగంగా నిన్న కొత్తగా (విస్తరించిన) లైన్ నుంచి మొదటి రేక్‌ను లోడ్ చేయడానికి దారితీసింది. కాకినాడ పోర్టుకు సంబంధించిన ఈ రేక్‌లో 4,083 టన్నుల ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడం ద్వారా రూ. 63 లక్షల ఆదాయాన్ని పొందింది.
అన్ని డివిజన్‌లు ఇలాంటి ప్రయత్నాలను కొనసాగించాలి
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్‌ను, బిడియూ బృందంతో పాటు ప్రధాన కార్యాలయం ఆపరేటింగ్, కమర్షియల్ టీంను కొత్త ట్రాఫిక్‌ను ఆకర్షించడానికి, స్టేషన్ నుంచి లోడింగ్‌ను పెంచడానికి సత్వర చర్యలు తీసుకున్నందుకు ప్రశంసించారు. రైల్వేల ఆదాయం పెంచేందుకై కొత్త సరకు రవాణాను ఆకర్షించడమే కాకుండా వివిధ స్టేషన్లలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్‌ను పటిష్టం చేసేందుకు అన్ని డివిజన్‌లు ఇలాంటి ప్రయత్నాలను కొనసాగించాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News