Thursday, March 13, 2025

ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు

- Advertisement -
- Advertisement -

రూ. 5 కోట్లతో ఆధునీకరణ పనులు: అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న ఐపిఎల్ సీజన్ కోసం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నట్టు హెచ్‌సిఎ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు. బుధవారం ఆయన బిసిసిఐ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులతో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. అనంతరంఆయన మీడియాతో మాట్లాడుతూ ఏర్పాట్ల గురించివివరించారు. మరో పది రోజుల్లో ఉప్పల్ స్టేడియం లో ఐపిఎల్ తొలి మ్యాచ్ జరుగనుందని, ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేసినట్టు తెలిపారు.

రూ.ఐదు కోట్ల వ్యయంతో స్టేడియానికి కొత్త హంగులు సమకూర్చుతున్నట్టు వివరించారు.స్టేడియం మొత్తం రంగులు వేస్తున్నట్టు, నార్త్ స్టాండ్స్‌లో కొత్త రెస్ట్ రూమ్స్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. అంతేగాక క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్స్, కా ర్పొరేట్ బాక్సుల్లో ఏసిలు,టైల్స్‌మారుస్తున్నామని తెలిపారు. దీని కో సం హైదరాబాద్ క్రికెట్ సంఘం తరఫున ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సిఎస్‌ఆర్ పథకం కింద ఎస్‌ఆర్‌హెచ్ కూడా సహకారం అందిస్తుందన్నారు. కాగా, జగన్‌మోహన్ రావుతో పాటు బిసిసిఐ ప్రతినిధులు వైభవ్, యువరాజ్, సన్‌రైజర్స్ తరఫున శరవానణ్, రోహిత్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News