Sunday, March 9, 2025

సరికొత్త ప్రేమ కథను ‘దిల్ రూబా’లో చూస్తారు

- Advertisement -
- Advertisement -

సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా దిల్ రూబా. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘దిల్ రూబా‘ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రూబా సినిమా ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు విశ్వకరుణ్ మీడియాతో మాట్లాడుతూ “కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీకి ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను. క మూవీ సక్సెస్ తర్వాత మరింత గ్రాండియర్‌గా దిల్ రూబాను తీసుకురావాలని అనుకున్నాం. ఆ క్రమంలో కొన్నిమార్పులు చేశాం గానీ మూలకథలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ సినిమాలో తన తప్పు లేనప్పుడు సారీ ఎందుకు చెప్పాలనుకుంటాడు హీరో. ఇలాంటి వ్యక్తిత్వం వల్ల తనతో ఉన్నవారికి ఇబ్బంది ఉండొచ్చు. దిల్ రూబా సినిమాలో కిరణ్ చేసిన సిద్ధు క్యారెక్టర్ కూడా తన వ్యక్తిత్వం విషయంలో రాజీపడడు. దానివల్ల అతని లైఫ్‌లో ఇబ్బందులు వస్తాయి. ప్రేమించిన అమ్మాయితో విడిపోయిన తర్వాత ఆ లవర్ ను శత్రువులా చూస్తుంటారు. కానీ ప్రేమ కంటే ముందు వారి మధ్య ఉండేది స్నేహమే. అదే స్నేహాన్ని విడిపోయిన తర్వాత కూడా పంచవచ్చు. బాగున్నావా అని ఫోన్ చేసి మన ఎక్స్ లవర్‌ను అడగటంలో తప్పులేదు. దిల్ రూబా కథలో ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. సరికొత్త ప్రేమ కథను దిల్ రూబాలో చూస్తారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News