కీసరః కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరుగా జరిగిన రెండు సంఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అహ్మద్‌గూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో జరిగిన సంఘటనలో ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు ఆర్ధిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డారు. సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మూడుచింతలపల్లి మండలం కేశ్వాపూర్ గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు (24), కాప్రా జమ్మిగడ్డకు చెందిన బొట్టు వైష్ణవి (20) గత ఆరు నెలల క్రితం ప్రేమ వివాహాం చేసుకొని అహ్మద్‌గూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆంజనేయులు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
గత కొన్ని రోజులుగా ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా సోమవారం అర్థరాత్రి 1.00 గంటల ప్రాంతంలో ఇద్దరు ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొదట వైష్ణవి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా తర్వాత ఆంజనేయులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు బావిస్తున్నారు. నవ దంపతులు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
కుందన్‌పల్లిలో కౌలు రైతు ఆత్మహత్య
కుందన్పల్లి గ్రామంలో ఉరి వేసుకొని కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుందన్‌పల్లి గ్రామానికి చెందిన కడమంచి నర్సింహ్మ (38) గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో సోమవారం రాత్రి వ్యవసాయ పొలంలోని గదిలో తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
ఫోటో రైటప్స్‌ః