- Advertisement -
అమరావతి: కృష్ణ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం పామర్రులో పెళ్లైన పది నెలలకే ఓ నవ వధువ ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నవ వధువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వరకట్న వేధింపులతో అల్లుడే తమ కూతురిని చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
New Married Woman Suicide in Krishna District
- Advertisement -