Sunday, December 22, 2024

చక్కెర వ్యాధికి 14 రోజుల నయపు మందు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చక్కెర ఉందా? మూలిక ముందులతో పక్షంరోజులలో ఈ వ్యాధి నయం అవుతుందని ఇటీవలి అధ్యయనంలో తేల్చారు. జిబిఆర్ వనమూలిక ఔషధం మధుమేహం కట్టడి చేసే దివ్యౌషధం అవుతుందని అధ్యయనంలో తెలిపారు. భారతదేశంలో వనమూలికల వైద్యం తరాలుగా సాగుతోంది. ఇదే క్రమంలో మనిషి జీవన అలవాట్ల విపరీతాలతో మధుమేహం లేదా షుగర్ ఎక్కువ మందికి సోకుతోంది. ఇది చివరికి బ్లడ్‌షుగర్‌కు దారితీసి, చివరి దశలో బ్రెయిన్ స్ట్రోక్‌లకు కూడా వీలు కల్పిస్తోంది. ముందు జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఇదే క్రమంలో మూలికా మందుల సమ్మిశ్రితం అయిన బిజిఆర్ 34 వంటివి తీసుకుంటే కేవలం 14 రోజుల వ్యవధిలోనే బ్లడ్‌షుగర్ స్థాయిలు తగ్గి, చక్కెర వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చునని అధ్యయనంలో తేల్చారు. పాట్నాకు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రికి చెందిన పరిశోధకుల బృందం షుగర్‌కు వనమూలిక వైద్యం గురించి పరిశోధనలు చేపట్టారు. అత్యంత తీవ్రస్థాయి బ్లడ్‌షుగర్ లెవెల్స్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తిపై అధ్యయనం జరిపారు.

ఈ వ్యక్తి ఈ చక్కెర విషమ పరిస్థితి నుంచి బయటపడ్డ వైనాన్ని నిర్థారించుకుని, ఈ వివరాలను ఇప్పుడు అంతర్జాతీయ ఆయుర్వేద వైద్య పత్రిక ఐఎఎంజెలో ప్రచురించారు. వనమూలికా వైద్యం తరువాత ఈ రోగిలో మంచి మార్పు కన్పించింది. చికిత్సకు ముందు రక్తంలో ఉన్న బ్లడ్‌షుగర్ 254 ఎంజి/డిఎల్ ఆ తరువాతి క్రమంలో 124 ఎంజి/డిఎల్‌కు చేరుకున్నట్లు గుర్తించారు. షుగర్ తీవ్రత ఎక్కువవుతున్న ఈ రోజులలో దీని కట్టడికి తలపెట్టిన అత్యంత ఈ కీలకమైన ఈ అధ్యయనానికి, చికిత్స క్రమానికి కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభాస్ చంద్ర పాఠక్ నాయకత్వం వహించారు. మెంతి, విజయ్‌సార్, డరూహరిడ్రా, మజిస్త వంటి వాటి మిశ్రితం అయిన జిబిఆర్ 34లో పుష్కల స్థాయిలో మధుమేహ నివారక లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. రక్తంలో షుగర్ శాతాన్ని పడిపోయ్యేలా చేసేందుకు దారితీస్తాయని వెల్లడైంది. షుగర్ నివారక ఈ వనమూలిక మందును దేశంలోని ప్రఖ్యాత ప్రాధమిక అధ్యయన సంస్థ సిఐఎస్‌ఆర్ పూర్తి స్థాయి రిసెర్చ్ తరువాత రూపొందించింది.

ఈ నెల 14వ తేదీ ప్రపంచ మధుమేహ దినం నేపథ్యంలో ఈ ఔషధం గురించి ఐమిల్ ఔషధ ఉత్పత్తి సంస్థ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ సంచిత్ శర్మ తెలిపారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా దీర్ఘకాలిక లేదా జీవితాంత మందులు, ఎంతకూ నయం కాని స్థితికి చేరుకుంటున్న దశలో ఇటువంటి స్వల్పకాలిక లేదా కేవలం 14 రోజుల నయా ఔషధం మేలు చేసే మార్గం అవుతుందని చెప్పారు. మధుమేహం నివారణతో పాటు మనిషిలో ఆమ్ల లక్షణాల కట్టడికి, సరైనవిధంగా ఆకలి వేసేందుకు , వైరస్‌లు వ్యాపించే ప్రస్తుత దశలో పూర్తి స్థాయిలో ఇమ్యూనిటి కల్పించేందుకు బిజిఆర్ 34 ఉపయోగపడుతుందని పరిశోధకులు ఆశిస్తున్నారు. ఈ ఔషధం తీసుకున్న వారు ఆహార అలవాట్లు పాటించాలి. ప్రత్యేకించి షుగర్‌కు దారి తీసే తిండి మానాలి. రోజు కనీసం నాలుగు గంటలు నడక సాగించాలి. జిబిఆర్‌తో కేవలం షుగర్ ఒక్కటే కాకుండా స్థూలకాయం నివారణకు కూడా మేలు జరుగుతుందని ఇంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్ జరిపిన సర్వేలో తేల్చారు. మందు వాడటం, దీనికి అనుబంధంగా సరైన రీతిలో జీవనక్రమపు అలవాట్లు పాటించడం అత్యంత కీలక అంశాలని ఎయిమ్స్‌వర్గాలు తెలిపాయి.

పలు రకాల అస్థవ్యస్థ జీవన అలవాట్లు, తిండితో దేశం ఓ విధంగా షుగర్ వ్యాధి వేదిక అవుతోంది. 2019 నుంచి 2021 మధ్య రెండేళ్ల కాలంలోనే దాదాపు మూడు కోట్ల పది లక్షల మందికి ఈ షుగర్ బీమారీ సోకింది. దీనితో వీరి జీవితాలు వారి చుట్టూ ఆధారపడి ఉండే వారి జీవితాలు బాధాకర మలుపు తిరిగాయి. ఈ దశలో ఈ వనమూలిక మందు ప్రత్యేకించి సైడ్ ఎఫెక్ట్‌లు లేని చికిత్స ఎంతో ఉపయుక్తం అని వెల్లడైందని నిపుణులు తెలిపారు. అత్యధిక సంఖ్యలో వయోభేదాలు లేకుండా షుగర్‌కు గురి అవుతున్నట్లు మద్రాస్ డయాబెటిస్ రిసర్చ్ సంస్థ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News