Sunday, January 19, 2025

లంగ్‌క్యాన్సర్ చికిత్సలో అధునాతన విధానాలు

- Advertisement -
- Advertisement -
శ్వాసకోశ క్యాన్సర్లపై అంతర్జాతీయ సదస్సులో యశోద ఆసుపత్రి ఎండి జి.ఎస్.రావు

హైదరాబాద్: లంగ్ క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించి, నిర్ధారించే అద్వితీయ చికిత్సగా అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందుతున్న ‘ఇటస్‘ ఈ చికిత్సా అతికొద్ది అత్యాధునిక వైద్యకేంద్రాలలో అందుబాటులోకి వచ్చిందని యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.యస్. రావు తెలిపారు. ఆదివారం అత్యాధునిక ఎండో బ్రాంకియల్ అల్ట్రా సౌండ్, శ్వాస కోశ క్యాన్సర్లపై అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాపు నిర్వహిచింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ (ఇబస్ కి సంబంధించి మనదేశంలో అగ్రగామిగా ఉన్న యశోద హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా ఉన్న పల్మొనాలజిస్టులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం దృష్ట్యా అంతర్జాతీయ ప్రముఖ పల్మనాలజిస్టులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ శిక్షణా కార్యక్రమంలో పల్మనాలజిస్టులు వినూత్న చికిత్సా ప్రక్రియ అయిన ఇటస్ గూర్చి సమగ్రంగా తెలుసుకోవటమే కాకుండా లంగ్ క్యాన్సర్ చికిత్సలో అధునాతన చికిత్సా విధానాలు అమలుచేయటంలో అనుభవం పొందుతారని పేర్కొన్నారు. అనంతరం పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్. వి. నాగార్జున మాటూరు ప్రసంగిస్తూ మన దేశంలో పురుషుల మరణాలకు కారణమవుతున్న కాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సర్ రెండో స్థానంలో ఉందని, దేశంలో ఏటా సమోదయ్యే కాన్సర్ కేసులలో 7 శాతం కేసులకు, కాన్సర్ మరణాలలో 10 శాతానికి కారణం శ్వాసకోశాల కాన్సర్లేనన్నారు. జనాభాలోని ప్రతీ లక్షమందిలో సుమారు 30 మంది ఈ వ్యాధి బారి పడుతున్నట్లు అంచనా.

శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధులు, ప్రత్యేకించి కాన్సర్లు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లను నిర్ధారించే పరీక్షలు కష్టతరంగా, వ్యాధిగ్రస్థులకు తీవ్ర అసౌకర్యంగా ఉంటూ వచ్చాయి. ఇటువంటి తీవ్రమైన, ప్రాణాంతకమైన వ్యాధులను వీలైనంత వేగంగా, గుర్తించేందుకు ఎండో బ్రాంఖియల్ అల్ట్రాసౌండ్ ’ఇబస్’ తో పరిష్కారం లభిస్తుంది. ‘ఇటస్ విధానంలో రోగి శరీరంపైన ఎటువంటి గాటుపెట్టవలసిన అవసరం ఉండదు. దీనిలో డాక్టర్ బ్రాంఖోస్కోప్ ను నోటి గుండా పంపించటం ద్వారా లింఫ్ నోడ్స్ కూ సంబంధించిన నీడిల్ బయాప్సీ చేయగలుగుతారు. ఇలస్ కోసం అల్ట్రాసౌండ్ ప్రాసెసర్, ఫైన్ గేజ్ అస్సిరేషన్ నీడిల్తో కూడిన ప్రత్యేకమైన ఎండోస్కోపును రోగుల శ్వాసనాళం ద్వారా పంపిస్తారు. అల్ట్రాసౌండ్‌తో శ్వాస మార్గాలు, రక్తనాళాలు, శ్వాసకోశాలు, లింప్ నోడ్స్ యథాతథ చిత్రాలను చూస్తూ డాక్టర్లు పరిస్థితిని అంచనా వేయగలుగుతారని పేర్కొన్నారు. ఊపిరితిత్తులు, లింప్‌నోడ్స్‌కు సంబంధించిన సమస్యలను దీని ద్వారా ఖచ్చితంగా గుర్తించడం సాధ్యపడుతుందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News