- Advertisement -
న్యూయార్క్: అమెరికాలోని న్యూమెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. లా క్రూసెజ్ లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరగడంతో ముగ్గురు చనిపోగా 15 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని రెండు గ్రూపులోని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు యువకులు ఉన్నారు. గాయపడిన వారు 16 ఏళ్ల నుంచి 36 ఏళ్ల మధ్య ఉంటారని పోలీసులు వెల్లడించారు. అనుమతిలేని కారు ప్రదర్శించడంతోనే కాల్పులు జరిగియని పోలీస్ అధికారి జెరేమీ స్టోరీ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -