Monday, December 23, 2024

హైదరాబాద్ శివార్లలో కొత్త ఎమ్‌ఎమ్‌టిఎస్‌ సేవలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సబర్బన్ ప్రయాణికుల ప్రయోజనాల కోసం దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) మేడ్చల్, లింగంపల్లి, హైదరాబాద్ మధ్య ఆరు కొత్త ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసులను ప్రవేశపెట్టింది. దానికి తోడు ఉమ్దానగర్, సికింద్రాబాద్, ఫలక్‌నుమా మధ్య ఆరు సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

జంట-నగర ప్రాంతంలోని రైలు ప్రయాణికుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ సేవలు ప్రవేశపెట్టబడ్డాయి. రోజువారీ ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఎస్సీఆర్ జనరల్ మేనేజర్, అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ… కొత్త టైమ్‌టేబుల్ ప్రకారం, కార్యాలయాలకు, ఎక్కువ దూరం ప్రయాణించే వారి అవసరాలను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

రైళ్లు రద్దు
మరోవైపు గుంటూరు డివిజన్‌ ​​పరిధిలోని ఐదు స్టేషన్ల మధ్య మౌలిక వసతుల కల్పన పనుల కారణంగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. అక్టోబరు 9 నుంచి 15 వరకు కాచిగూడ, నడికుడే, గుంటూరు, సికింద్రాబాద్‌, మెదక్‌ల మధ్య రైలు సర్వీసులను రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News