Monday, December 23, 2024

మేడ్చల్ – లింగంపల్లి – మేడ్చల్ స్టేషన్ల మధ్య నూతన ఎంఎంటిఎస్ రైలు సేవలు

- Advertisement -
- Advertisement -

అందుబాటులోకి తెచ్చిన దక్షిణ మధ్య రైల్వే

మన తెలంగాణ / హైదరాబాద్ : మేడ్చల్ – లింగంపల్లి , అలాగే మేడ్చల్ – హైదరాబాద్ స్టేషన్ల మధ్య దక్షిణ మధ్య రైల్వే నూతన ఎంఎంటిఎస్ రైలు సేవలను ప్రవేశపెట్టింది. దీంతో ఆయా నగరాల మధ్య అతి చవకగా ప్రయాణించే వీలు కల్పించినట్లు తెలిపింది. రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉదయం , సాయంత్రం రద్దీ సమయాల్లో ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడిపేలా ఎంఎంటిఎస్ సేవల సమయాలు సవరించినట్లు తెలిపింది. – ఇప్పుడు వందే భారత్ రైలు సమయాలకు అనుకూలంగా ఎంఎంటిఎస్ రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది.

జోన్ ఎంఎంటిఎస్ సేవల ద్వారా సాధారణ ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, జంట నగర ప్రాంతంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి అనేక చర్యలను చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా జోన్ సబ్-అర్బన్ ప్రయాణీకుల ప్రయోజనం కోసం అక్టోబర్ నుండి అమలులోకి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే నూతన టైమ్ టేబుల్‌లో మేడ్చల్ – లింగంపల్లి , మేడ్చల్ – హైదరాబాద్ అలాగే మేడ్చల్ – లింగంపల్లి ప్రాంతాల మధ్య ఆరు కొత్త ఎంఎంటిఎస్ సర్వీసులను ప్రవేశపెట్టింది. మరీ ముఖ్యంగా జంట నగర ప్రాంతంలోని సబర్బన్ ప్రయాణికుల నుండి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఎంఎంటిఎస్ సేవలను పునర్వ్యవస్థీకరించారు. రోజువారీ ప్రయాణికులు ,కార్యాలయాలకు వెళ్లేవారికి ప్రయోజనం కోసం ఉదయం , సాయంత్రం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయములో మేడ్చల్ లింగంపల్లి సెక్షన్ మధ్య 4 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రవేశ పెట్టారు. దీనితోపాటు తాజాగా మేడ్చల్ -హైదరాబాద్ స్టేషన్ల మధ్య మొదటిసారిగా ఎంఎంటిఎస్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రైళ్ల నూతన టైమ్ టేబుల్ తో ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కల్గుతుందన్నారు. కార్యాలయాలకు వెళ్లే వారి ప్రయాణ అవసరాలకు , కుటుంబ అవసరాల దృష్ట్యా ఎక్కువ దూరం ప్రయాణించే వారి ప్రయాణ అవసరాలను సులభతరం చేస్తుందన్నారు.

MMTS 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News