Wednesday, January 22, 2025

ధరణి పోర్టల్‌లో కొత్త మాడ్యూల్స్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి పోర్టల్‌లో కొత్త మాడ్యూల్స్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భూ లావాదేవీలకు సంబంధించి సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు కొత్త మాడ్యూల్స్ అవసరమని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఏ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

దీనిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం కొత్త మాడ్యూల్స్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు ధరణికి ముందు ‘కార్డ్’ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో జరిగిన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఏజిపిఏ), స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ(ఎఎస్‌పిఏ)లకు సంబంధించి, స్టాంపు డ్యూటీని సవరించేందుకు అనుమతి ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News