Saturday, November 23, 2024

త్వరలో రూ.52కోట్లతో కొత్త మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : మంత్రి కెటిఆర్ నేతృత్వంలో నాలాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా పనులు వేగవంతం చేశామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకన్న అన్నారు. వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తిచేసి ముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశా రు. వారంరోజులుగా భారీ వ ర్షా లు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల అధికారు లు, కార్పొరేటర్ విజయ కుమార్‌ గౌడ్‌తో కలిసి మూసారాంబాగ్ బ్రిడ్జి పరిసర ప్రాం తాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..నగర వ్యాప ్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీతో పాటు మొత్తం అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. భారీగా వస్తున్న మూసివరదతో చిన్నగా ఉన్న మూసారాంబాగ్ తరచూ మునిగిపోతూ ఇబ్బ ందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసమస్య పరిష్కారం కోసం మంత్రి కెటిఆర్ రూ.52కోట్ల వ్యయంతో మూసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న రహదారులను గుర్తించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసే విధంగా చర్యలు చేపడు తున్నామని చె ప్పారు. భారీవ ర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రతలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి శరత్‌కుమా ర్, సిఐ కిషన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొ న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News