Wednesday, January 22, 2025

ఎస్‌సి వర్గీకరణ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు

- Advertisement -
- Advertisement -

ముందుగా డిఎస్‌సి వెలువడే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్‌సి వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, ఎస్‌సి వర్గీకరణపై అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏకసభ్య కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఎస్‌సి వర్గీకరణకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు.

ఆ లోగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టిజిపిఎస్‌సి పటిష్ట విధానం రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లలో ముందుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్‌సి వెలువడే అవకాశం ఉన్నది.
6 వేల పోస్టులతో మరో మెగా డిఎస్‌సి కోసం త్వరలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్ వెలువడగా, జనవరి 2 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు జరుగనున్నాయి.

మార్చిలోపు గ్రూప్ 2 ఫలితాలు..?

రాష్ట్రంలో ఈ నెల 15,16 తేదీలలో గ్రూప్ -2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఫలితాలతో పాటు గ్రూప్ 1, ఇతర నియామక పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించి మార్చి లోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించే యుపిఎస్‌సి తరహాలో టిజిపిఎస్‌సి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నెల 18, 19 తేదీల్లో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేతృత్వంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లింది.

ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రముఖ ఏజెన్సీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి), ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవకతకలు జరుగకుండా, షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించే యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందిజేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News