- Advertisement -
న్యూఢిల్లీ : టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా రిటైర్మెంట్ తీసుకున్న పైలట్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పదవీవిరమణ పొందిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మళ్లీ నియమించుకునే ఆఫర్‌ను అందిస్తోంది. 300 సింగిల్ ఐసిల్ విమానాలను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఆపరేషన్లలో విమాన సంస్థ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తోంది. రిటైర్మెంట్ పొందిన పైలట్లను మళ్లీ నియమించుకుని, కమాండర్లుగా తీసుకోవాలనుకుంటోంది. దీని కోసం విమాన సంస్థ రిటైర్ అయిన పైలట్లను సమ్మతిని కోరుతోంది.
- Advertisement -