Tuesday, November 5, 2024

పార్లమెంటు కొత్త భవనం ఫస్ట్ లుక్ వీడియో విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆధునిక హంగులతో నిర్మించబడ్డ నూతన పార్లమెంటు భవనం ఈ నెల 28న ప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కొత్త పార్లమెంటు భవనానికి సంబంధించి ఫస్ట్ లుక్ వీడియో శుక్రవారం విడుదలయింది.ఆ వీడియోలో పార్లమెంటు లోపలి, బయటి దృశ్యాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం యాగం. సర్వమత ప్రార్థనలతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. అక్కడ రాజదండాన్ని తమిళనాడుకు చెందిన అధీనం పూజారులు ప్రధాని నరేంద్ర మోడీకి లాంఛనంగా అందజేస్తారు. ఈ రాజదండాన్ని లోక్‌సభ స్పీకర్ స్థానానికి దగ్గర్లో ప్రతిష్ఠిస్తారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 25 రాజకీయ పార్టీలు హాజరు కానుండగా కాంగ్రెస్ సహా 20 విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నాయి. త్రిభుజాకారంలో నాలుగంతస్థులుగా నిర్మించిన పార్లమెంటు భవనం మొత్తం విస్తీర్ణం 64,500 చదరపు మీటర్లు భవనానికి జ్ఞానద్వార్, శక్తిద్వార్, కర్మద్వార్ పేరుతో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన భవనం లోపలి భాగాలను మూడు జాతీయ చిహ్నాలయిన పద్మం, నెమలి, మర్రిచెట్టు ఇతివృత్తాలుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుత పార్లమెంటు భవన నిర్మాణం 1927లోపూర్తి కాగా దాదాపు వందేళ్ల నాటిది కావడంతో ఈ కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది.

టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ నిర్మించిన ఈ భవ్య నిర్మాణంలో సువిశాలమైన లోక్‌సభ, రాజ్యసభ ప్రాంగణాలు, ఎంపీల కోసం లాంజ్, లైబ్రరీ, పలు కమిటీల గదులు, భోజన శాల, వాహనాల పార్కింగ్ కోసం సువిశాలమైన పార్కింగ్ ఏరియా కూడా ఉన్నాయి. భవనం లోపల అంతా కూడా భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా కళాత్మకంగా తీర్చిదిద్దడంతో సీటింగ్ ఏర్పాట్లు మొదలుకొని అన్నీ కూడా అత్యాధునికంగా ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News