Monday, January 20, 2025

నూతన పార్లమెంట్ భవనం ‘శవపేటిక’లా ఉంది: ఆర్‌జెడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం శవపేటిక వలే ఉందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) ఆదివారం వ్యాఖ్యానించింది. దానిని బిజెపి తిప్పికొట్టింది. బీహార్‌కు చెందిన ఆ పార్టీని 2024 లోక్‌కసభ ఎన్నికల్లో అలాంటి శవపేటికలోనే ప్రజలు బొంద పెడతారని బిజెపి ఎదురు దాడికి దిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంటు భవనాన్ని ఆరంభించాక, బీహార్‌కు చెందిన ఆర్‌జెడి పార్టీ నూతన పార్లమెంటు భవనం, శవపేటిక చిత్రాలను పక్కపక్కన పెట్టి ‘ఏమిటిది?’ అని ట్వీట్ చేసింది.
బీహార్‌కు చెందిన బిజెపి యూనిట్ ‘మొదటి చిత్రం మీ భవిష్కత్తుది, రెండోది భారత్‌ది. అర్థమైందా?’ అని ట్వీట్ చేసింది. బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆర్‌జెడి ట్వీట్ ‘అసహ్యకరమైనది’ అని అభివర్ణించగా, మరొక అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆ శవపేటిక ఆర్‌జెడికి, దేశ పార్లమెంటుకు చెందింది అన్నారు.
‘ఇది వారి దిగజారిన స్థాయి. అసహ్యకరమైనది. ఇది ఆర్‌జెడి రాజకీయాల శవపేటికకు చివరి మేకు కాగలదని రుజువవుతోంది. భారతీయ వ్యవస్థలో త్రిభుజాకారం చాలా ప్రాముఖ్యమైనది. ఇక శవపేటిక షట్కోణంలో ఉంటుంది. లేక ఆరు వైపుల బహుభూజి కలిగి ఉంటుంది’ అని పూనావాలా ట్వీట్ చేశారు.
ఇక భాటియా ‘నేడు చారిత్రాత్మక రోజు. దేశం గర్విస్తోంది. మీరు కేవలం ‘నజర్‌బట్టు’(దిష్టిని పారద్రోలే చిహ్నం) తప్ప మరేమి కాదు. మీ ఛాతీని చరుచుకుంటూ ఉండండి’అన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రారంభించాక ప్రధాని మోడీ ‘ఈ దిగ్గజ భవనం సాధికారత ఊయల కావాలి, స్వప్నాలను రగిలించాలి, వాటిని వాస్తవికం చేయాలి’ అని ఆకాంక్షించారు. ఇది దేశాన్ని నూతన శిఖరాలకు నడిపించాలని ప్రధాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News