Tuesday, January 21, 2025

పేజీ తిప్పేస్తున్నా … జనంలోకి వెళ్లుతున్నా: పికె

- Advertisement -
- Advertisement -

ప్రయాణం మార్చే టైం వచ్చింది
ఎన్నికల వ్యూహకర్త పికె

Congress can't be allowed to die Says Prashant Kishor
పాట్నా : ఇప్పుడు తాను తన నిజమైన బాస్‌లు అంటే తన ప్రజల వద్దకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం తాజా ట్విట్టర్ వెలువరించారు. ఇది రాజకీయ వర్గాలలో సంచలనానికి దారితీసింది. రియల్ మాస్టర్స్ వద్దకు వెళ్లుతా. ఆ టైం ఇప్పుడు వచ్చింది. వారు తన ప్రజలే అని ఇప్పుడు అసలు సిసలు సమస్యలు తెలుసుకోవల్సి ఉంది. జనం మధ్యకు వెళ్లి వారి కష్టాలు కడగండ్లను అర్థం చేసుకోవల్సి ఉంది. ఈ క్రమంలో ప్రజా సుపరిపాలన దారి దొరుకుతుందని ఆశిస్తున్నానని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. జన్ సురాజ్ ప్రజా సుపరిపాలన దిశలో సాగుతానని , ఈ అవసరం ఏర్పడిందని తెలిపారు. పది సంవత్సరాలుగా అనేక ఒడుదుడుకుల నడుమ పయనం సాగిందని ఇక తన ఈ ప్రయాణంలో కొత్త పేజి తిప్పుతున్నానని వ్యాఖ్యాంచారు.

ఇటీవలే ఆయన కాంగ్రెస్ ప్రవేశం ఆగిపోయింది. మరో వైపు ఆయన టిఆర్‌ఎస్‌కు అంతర్గత ఎన్నికల వ్యూహకర్తగా మారుతారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన తాను తన బీహార్‌కు వెళ్లుతున్నానని, జనం వద్దకు పోతానని పరోక్షంగా తెలియచేయడం అనేక విశ్లేషణలకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తాను పార్టీ బలోతానికి, ఘనమైన పూర్వపు చరిత్ర గల పార్టీకి వైభవం తీసుకువస్తానని, ఏదో తనను ఎక్స్‌ట్రా పాత్రధారుడిగా చూస్తే కుదరదని తేల్చిచెప్పిన పికెకు ఇప్పటికైతే కాంగ్రెస్ తలుపులు వేసినట్లు అయింది. బిజెపికి కేవలం కాంగ్రెస్ సారధ్యపు ఫ్రంట్ పోటీని ఇస్తుందని అంతకు మించి అనేక కూటములతో ఫలితం లేదని తరచూ చెపుతూ వచ్చే పికె ఇప్పుడు తన స్వరాష్ట్రం బీహార్ బాట పడుతున్నారు. తనకు నితీశ్ కుమార్ ఆదర్శం అని చెప్పే ఆయన రాజకీయాలలో చేరి తరువాత అభిప్రాయభేదాలతో బయటకు వచ్చారు.

అప్పటి నుంచి ఎన్నికల వ్యూహకర్తగా పేరొందారు. తన మాస్టర్స్ వద్దకు వెళ్లుతున్నానని తెలిపిన ప్రశాంత్ కిషోర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఆయన కొత్త రాజకీయ పార్టీ పెడుతారా? లేక ఏదో ఒక పార్టీలో చేరుతారా? అనేది స్పష్టత ఇవ్వలేదు. బీహార్‌కు ఇప్పటికే చేరుకున్న ప్రశాంత్ అధికార బిజెపి జెడియు కూటమి సర్కారుకు దూరంగా ఉంటున్నారు. నితీష్‌కుమార్‌ను కూడా కలుసుకోలేదు. ఇప్పటికైతే ఆయన తాను స్వతంత్రుడినని తెలియచేసుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ త్వరలోనే విస్తృతంగా బీహార్‌లో పర్యటించే వీలుంది. ఓటర్లను కలుసుకుంటారు. వారి సమస్యలు తెలుసుకుని తానేమీ చేయాల్సి ఉందనేది అర్థం చేసుకుంటారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News