Sunday, January 19, 2025

పదిరోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తా : ఆజాద్

- Advertisement -
- Advertisement -

new party will be announced in ten days: Ghulam Nabi Azad

న్యూఢిల్లీ : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తాను మరో 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని ఆదివారం వెల్లడించారు. కాంగ్రెస్‌ని వీడిన తరువాత ఆదివారం బారాముల్లాలో తొలిసారి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో మిలిటెంట్ కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అందరినీ ఉగ్రవాదులు టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు , భూమి హక్కుల కోసం , స్థానికులకు ఉద్యోగాలు తీసుకురావడం కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. అయితే ఇంకా పార్టీ పేరును నిర్ణయించలేదని, జమ్ముకశ్మీర్ ప్రజలే పార్టీ పేరు , పతాకాన్ని నిర్ణయిస్తారని ఆయన ఇటీవల పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా పార్టీకి హిందుస్థానీ పేరు పెడతానని చెప్పిన విషయం తెలిసిందే .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News