Friday, November 22, 2024

ఆధార్ అనుసంధానం లేని కొత్త పాస్ పుస్తకాలకు వారంలో మోక్షం!

- Advertisement -
- Advertisement -

New pass books without Aadhaar affiliation

నోటీసులు ఇచ్చి మరోసారి అవకాశం కల్పించాలని కలెక్టర్‌ల నిర్ణయం
సుమారు 2 లక్షల ఎన్నారైలకు లబ్ధి

హైదరాబాద్: ఆధార్ అనుసంధానం లేకుండా నిలిచిపోయిన పట్టాదారు పాసు పుస్తకాలు వారంలో మోక్షం కలిగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం కలెక్టర్‌లు,ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో ఈ విషయంపై సిఎం కెసిఆర్ కీలకమైన ఆదేశాలు జారీ చేయడంతో వాటి పరిష్కారానికి కలెక్టర్‌లు చర్యలు చేపట్టారు. ఆధార్ ఇవ్వకపోవడంతో 2,99,974 పాసు పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయాయి. వీటిని పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం పలుమార్లు ఆధార్‌కార్డు ఇవ్వాలని సంబంధిత రైతులను కోరింది. అయినా వారు స్పందించకపోవడంతో వాటిని పెండింగ్‌లో పెట్టింది. ప్రస్తుతం దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా సిఎం కెసిఆర్‌కు విజ్ఞప్తులు అందడంతో ఈ సమస్యను పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్‌లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. నిలిచిపోయిన పెండింగ్ పుస్తకాలు 2.99,974లో సుమారు 2 లక్షల పాసు పుస్తకాలు ఎన్‌ఆర్‌ఐలకు చెందినవి. భూ రికార్డుల ప్రక్షాళన తరువాత ఎలక్ట్రానిక్ ఈ పాసు పుస్తకాలను ప్రభుత్వం రైతులకు అందచేసింది.

అందులో భాగంగానే ఆధార్ లేని వారికి కొత్త పాసు పుస్తకాలను ప్రభుత్వం అందించలేదు. కొత్త పాసు పుస్తకాలు లేని సుమారు 2.99 లక్షల ఖాతాల రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడంతో పాటు వాటికి రైతుబంధు కూడా జమకాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నారైలకు ఆధార్ స్థానంలో పాస్‌పోర్టు నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్‌లు చేయాలని, గతంలో ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని, కంపెనీలు, సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు పాసు పుస్తకం ఇవ్వాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. వారం నుంచి 10 రోజుల్లో కొత్త పాసు పుస్తకాలకు సంబంధించి ఆధార్ కార్డు ఇవ్వని వారికి నోటీసులు జారీ చేసి ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌లు నిర్ణయించినట్టుగా తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News