Saturday, December 21, 2024

త్వరలో కొత్త పింఛన్లు

- Advertisement -
- Advertisement -

New pensions coming soon:Harish rao

అదనంగా మరి 10లక్షల మందికి..

సంక్షేమం పంచేవారు
కావాలో.. పన్నులు
పెంచేవారు కావాలో ప్రజలే
తేల్చుకోవాలి వంద
అబద్ధాలాడైనా
అధికారంలోకి రావాలని
బిజెపి చూస్తోంది
దానికి ప్రజలు గుణపాఠం
చెప్పాలి సంగారెడ్డి సభలో
మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : ప్రజలకు సంక్షేమ పథకాలను పంచే వారు కావాలో.. పన్నుల మోపి ఇబ్బంది పెట్టేవారు కావాల్నో ప్రజలే తేల్చుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. జి ల్లా కేంద్రమైన సంగారెడ్డిలో రాష్ట్రంలోనే మొ దటిసారిగా అభయ హస్తం నిధులను మహిళలకు ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మం త్రి త్వరలో మరో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 30లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, 60సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను సిఎం కెసిఆర్ నాయకత్వంలో అమలుచేస్తున్నామన్నారు. గతంలో పెన్షన్ రూ.200 500 పెన్షన్ కో సం అభయహస్తం పథకంలో చేరారని, కెసిఆర్ ప్రభుత్వం మొదటిసారి వచ్చినప్పుడు పె న్షన్ వెయ్యికి పెంచారని, రెండోసారి అధికారంలోకి రాగానే 2వేలకు పెంచారన్నారు. దీం తో అభయహస్తం అవసరం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక బ్యాంకు లిం కేజీ రుణాలు పొందిన జిల్లా సంగారెడ్డి అని, రూ.672కోట్లు రుణాలుగా ఇచ్చామన్నారు.

త మ ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, 50మహిళా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా తెలంగాణ స్థాయి ప థకాలు లేనేలేవని, కెసిఆర్ పాలన చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు యాత్రల పేరుతో ప్రభుత్వాన్ని తిడుతున్నారన్నారు. వంద అబద్దాలు ఆడైనా పెళ్లి చేయాలన్నారని, అలాంటిది బిజెపి మాత్రం వంద అబద్దాలు ఆడైనా అధికారంలోకి రావాలని చూస్తోందని విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 నుంచి వెయ్యికి పెంచారన్నారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పంచుతుంటే, బిజెపి మాత్రం పన్నులు పెంచుతోందన్నారు. బిజెపిని గద్దెదించితేనే గ్యాస్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని హరీష్‌రావు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపిని గద్దెదించి గట్టి బద్ది చెప్పాలన్నారు. కార్పోరేట్లకు పట్టం కట్టి, పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. 30 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు సాధికారతకు బాటలు వేశాడన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించారన్నారు. ఒక అన్నగా, తండ్రిగా కెసిఆర్‌ను ప్రతి మహిళ గుండెల్లో పెట్టుకోవాలన్నారు. స్త్రీ నిధి కింద ఎంత డబ్బులయినా ఇస్తామని, రుణ తీసుకున్న మహిళ చనిపోతే రుణం మాఫీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈరోజు అభయహస్తం డబ్బులు వాపస్ ఇచ్చే కార్యక్రమాన్ని సంగారెడ్డిలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడంలేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంఎల్‌సి యాదవరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి శరత్, కలెక్టర్ హనుమంతరావు, జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ, డిసిఎంస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, మున్పిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి, లతా విజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News