హైదరాబాద్ : ఆకట్టుకునే ఫీచర్లతో వన్‌ప్లస్ సిరీస్ నుంచి మరో ప్రీమియం ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి రానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 పేరుతో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
ఫీచర్లు: ఈ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. కెమెరాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్ 965 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 5జీ నెట్ వర్క్‌తో పని చేసతే ఈ ఫోన్‌లో ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 6.7 ఇంచెస్ స్క్రీన్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్ ఈ ఫోన్ సొంతం. ఇదిలా ఉంటే ఈ ఫోన్ ధరకు సంబంధించిన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఈ ఫోన్ గరిష్టంగా 12జిబి ర్యామ్ మరియు 256జిబి వరకు అంతర్గత నిల్వను కలిగి ఉంటుందని అంచనా. ఇది రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్‌లలో వచ్చే అవకాశం ఉంది: 8జిబి ర్యామ్ మరియు 128జిబి అంతర్గత నిల్వ మరియు 12జిబి ర్యామ్ మరియు 256జిబి నిల్వ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ2కు కొనసాగింపుగా తీసుకొస్తున్నారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీకి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఇందులో ఏకంగా 67 డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నట్లు సమాచారం.