హైదరాబాద్: ఆధునిక ప్రపంచం వ్యాయామం, చురుకైన జీవనశైలి లేకపోవడంతో అనేక కొత్త శారీరక సమస్యలకు గురైతున్నారని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏజిఐ ఆసుపత్రి ఫౌండర్ డా. డి. నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఏషియన్ స్పైన్ ఆసుపత్రిలో ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ చివరికి దీర్ఘకాలిక వెన్నునొప్పి, వెన్నెముక రుగ్మతలకు దారితీస్తుందని, వెన్నెముక సంరక్షణ కోసం సమగ్ర కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఆసుపత్రి సమగ్ర వెన్నెముక సంరక్షణ కోసం ఒకే ఒక గమ్యం, ఇది అత్యంత అధునాతన కేంద్రం. అనంతరం ఆసుపత్రి నిర్వహకులు ప్రసంగిస్తూ మా నిపుణులు ఎండోస్కొపిక్ వెన్నెముక శస్త్రచికిత్సలో 2వేల కంటే ఎక్కువ కేసుల అనుభవం ఉందన్నారు. సరసమైన, నాణ్యమైన వెన్నెముక సంరక్షణ మా నిబద్దత. రోగులకు ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన అనుభవాన్ని అందించడమే తమ లక్షమన్నారు. ఈకార్యక్రమంలో డా. కాసు ప్రసాద్‌రెడ్డి, డా. సి. నరిసింహన్, డా. తంగరాజ్, మురళీ జయరామన్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాయామం లేకపోవడంతో కొత్త శారీరక సమస్యలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -