Friday, December 20, 2024

రాచకొండ పరిధిలో కొత్త పోలీస్టేషన్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నలుమూలాల విస్తరిస్తోంది. ఇదే సమయంలో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా మహేశ్వరం డీసీపీ జోన్ ను ఏర్పాటు చేసింది. మహేశ్వరం డీసీపీ జోన్ లో కొత్తగా ఏసీపీ ఏర్పాటు, ఇబ్రహీం పట్నం ఏసీపీ కూడా మహేశ్వరం డీసీపీ కిందకి చేర్చనున్నారు. చర్ల పల్లి పోలీస్ స్టేషన్, నాగోల్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్, మల్కాజ్ గిరి జోన్ లో మహిళ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానున్నాయి.H
కొత్తగా ట్రాఫిక్ విభాగంలో కొత్త జోన్లు, పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. ఘట్కేసర్, జవహర్ నగర్, మహేశ్వరం, ఇబ్రహీం పట్నంలలో ట్రాఫిక్ పొలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. మహాశ్వరం ట్రాఫిక్ జోన్‌కు ఎసిపిని నియమించనున్నారు. ఎల్బీ నగర్ జోన్, మహేశ్వరం జోన్, మల్కాజిగిరి జోన్‌లలో జాయింట్ కమిషనర్ స్థాయిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ప్రతి జోన్ కు అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) స్థాయి అధికారిని నియమించనున్నారు. ఇక యాదాద్రి ఆలయానికి ఎసిపి స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఎస్వోటీకి కొత్తగా మహేశ్వరం జోన్ డిసిపి గా ఏర్పాటు చేస్తారు. స్పెషల్ బ్రాంచ్‌కు కొత్తగా ఒక డిసిపిని నియమించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News