Thursday, February 27, 2025

రేవంత్ రెడ్డివి బ్లాక్ మెయిల్ రాజకీయాలు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డివి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి విమర్శలపై కిషన్ రెడ్డి స్పందించారు. తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. సిఎంగా ఉన్న వ్యక్తి అవగాహన లేక మాట్లాడటం సరికాదని సూచించారు. కేంద్రంలోని విధానాలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని, ఇలాంటి వ్యక్తి సిఎం కావడం రాష్ట్రప్రజల దురదృష్టమని ధ్వజమెత్తారు.

గనుల శాఖలో నూతన పాలసీలు తీసుకొచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 12 ఖనిజాల రాయల్టీని పెంచామని, ఈ ఏడాది 448 ప్రాజెక్టుల్లో గనుల అన్వేషణను జిఎస్‌ఐ చేపట్టిందన్నారు. న్యూఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  గనుల అన్వేషణలో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 12 ప్రైవేటు సంస్థలు గనుల అన్వేషణలో భాగస్వామ్యం అయ్యాయని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గనుల శాఖలో చాలా మార్పులు వచ్చాయని కిషన్ రెడ్డి వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News