Friday, April 4, 2025

వెంటనే నూతన పిఆర్‌సి కమిటీని నియమించాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : నూతన పిఆర్‌సి కమిటీని నియమించి వెంటనే ఐఆర్‌ను ప్రకటించాలని పిఆర్‌టియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉపాధ్యాయుల బదిలీలపై కోర్టు స్టే ఉన్నందున వెంటనే పదోన్నతుల ప్రక్రియను ప్రకటించాలని అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా జెడ్‌పి హాలులో సంఘం రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఎం.చెన్నయ్య అధ్యక్షతన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్, మాజీ ఎంఎల్‌సి కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, 33 జిల్లా అద్యక్ష, కార్యదర్శులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News