Monday, December 23, 2024

హైదరాబాద్‌లో కొత్త ప్రీ-ఓన్డ్ కార్ స్టోర్‌ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ మద్దతు కలిగిన ఆటో కంటెంట్ మరియు కామర్స్ పోర్టల్ కార్&బైక్ ఇటీవల యూజ్డ్ కార్ స్టోర్ కార్&బైక్ సెలెక్ట్ ను వివిసి మోటార్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని ఆటోనగర్‌లో ప్రారంభించింది. ఈ స్టోర్ కస్టమర్‌లు ఎంచుకోవడానికి అనేక రకాల సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్లను అందిస్తుంది. కస్టమర్‌లు గ్యారెంటీ బైబ్యాక్‌ని ఇక్కడ పొందవచ్చు, భారతదేశంలో అత్యంత సమగ్రమైన రెండు సంవత్సరాల యూజ్డ్ కార్ వారంటీని సైతం ఇక్కడ పొందవచ్చు మరియు ఉచిత హోమ్ టెస్ట్ డ్రైవ్ కోసం కారును ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు.

“కొత్తగా తెరిచిన స్టోర్ కార్ కొనుగోలు ప్రయాణంలో అత్యుత్తమ ప్రీ-ఓన్డ్ కార్ కొనుగోలు అనుభవాన్ని అందిస్తుంది. మా ఆన్‌లైన్ పోర్టల్, నిశితంగా తనిఖీ చేయబడిన వాహనాలు, నిపుణుల మార్గదర్శకత్వం మరియు స్వాగతించే షోరూమ్‌లు ద్వారా ఈ ప్రయాణంలో వినియోగదారునికి అవసరమైన సహాయాన్ని అందిస్తాయి. వ్యక్తిగత వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో, వినియోగదారులు తమ కలల కారును విశ్వాసంతో కొనుగోలు చేసేందుకు మార్గదర్శకత్వం వహించే తమ లాంటి భాగస్వామి అవసరం పెరుగుతోంది” అని మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ లిమిటెడ్ ఎండి & సీఈఓ మహమ్మద్ తుర్రా అన్నారు.

“హైదరాబాద్‌లో మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ యొక్క మొదటి కార్&బైక్ సెలెక్ట్ యూజ్డ్ కార్ స్టోర్‌ కార్&బైక్‌తో భాగస్వామ్యం చేసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అత్యున్నత కస్టమర్ అనుభవం మరియు కఠినమైన తనిఖీ ప్రక్రియ ద్వారా మా స్టోర్ నుండి అత్యుత్తమ కార్లు మాత్రమే విక్రయించబడతాయని నిర్ధారిస్తూ మా కస్టమర్‌లకు సేవలందించేందుకు మేము ఎదురుచూస్తున్నాము” అని డీలర్ ప్రిన్సిపల్ – వివి రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ & ఎండి – వివిసి గ్రూప్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News