Thursday, November 21, 2024

పార్లమెంట్ క్యాంటీన్‌కు సబ్సిడీ రద్దు.. క్యాంటీన్‌లో కొత్త ధరలు ఇవే..

- Advertisement -
- Advertisement -

New prices in Parliament canteen

 

న్యూఢిల్లీ : పార్లమెంట్ క్యాంటీన్‌లో ఆహార పదార్ధాలకు అందచేస్తున్న సబ్సిడీని రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మరికొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్‌ కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను విడుదల చేసింది. పార్లమెంట్ క్యాంటీన్‌లో చౌకగా లభించే ఆహారం చపాతీ. ఒక్కో చపాతి ధక రూ.3 కి లభిస్తుండగా.. నాన్ వెజ్ వంటకాల విషయంలో ధరలు ఓ రేంజ్‌లో పెరిగాయి.  నాన్ వెజ్ బఫెను రూ.700లకు పెంచారు. ఇక వెజ్‌ బఫె ధర రూ.500గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ప్రాచూర్యం పొందిన మన హైదరాబాదీ మటన్ బిర్యానీ ధర రూ.150గా ఫిక్స్ చేశారు. గతంలో ఈ వంటకాన్ని రూ.65కి అందించేవారు. అలాగే వెజ్‌ మీల్ ఇక నుంచి రూ.100కి లభించనుంది. కాగా రాయితీలు తీసివేయడం వల్ల ఏటా రూ.8 కోట్లు ఆదా కానున్నట్లు సమాచారం. అలాగే ఇక నుంచి ఈ క్యాంటీన్‌ను ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ఐటిడిసి) నిర్వహించనుందని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News