Monday, January 20, 2025

రేపు హైదరాబాద్‌లో కొత్త పిఎస్‌లు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో ఏర్పాటు చేసిన కొత్త పోలీస్ స్టేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర అవతరణ దీనోత్సవం సందర్భంగా కొత్తగా ఏర్పాటైన పో లీస్ స్టేషన్లు పనిచేయడం ప్రారంభం కానున్నాయి. ఉన్న పోలీస్ స్టేషన్లపై పనిభారం ఎక్కువ కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కొత్తగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వాటికి కావాల్సిన బడ్జెట్ తదితరాలను అందించింది. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా మూడు డిసిపిలు, ఎసిపిలు, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బోరబండ, ఫిలింనగర్, గుడిమల్కాపూర్, బండ్లగూడ, దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారసిగూడ, ఐఎస్ సదన్, మాసబ్ ట్యాంక్, మధురానగర్‌లో కొత్తగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎసిపి డివిజన్లు గాంధీనగర్, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, గోల్కొండ, కుల్సుంపుర, ఛత్రినాక, జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్ నగర్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రెండు డిసిపిలు, 11 ఎసిపి డివిజన్లు, 11 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌లో కొత్తగా రాజేంద్రనగర్, మేడ్చల్‌లను డిసిపిలను ఏర్పాటు చేశారు. కొత్త పోలీస్ స్టేషన్లను మోకిలా, అల్లాపూ ర్, కొల్లూరు, సూరారం, జినోమ్ వ్యాలీ, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్, చర్లపల్లి పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కొత్త పోలీస్ స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలు, సిబ్బందిని ఆయా పోలీస్ కమిషనర్‌లు నియమించారు. వీరు ఈ నెల 2వ తేదీ నుంచి విధులు నిర్వర్తించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News