సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ఆర్టిస్ట్. ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆర్టిస్ట్’ మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ “-ఇది మా సంస్థలో రెండో మూవీ. భవిష్యత్తులోనూ మూవీస్ చేస్తాం. డైరెక్టర్ రతన్ రిషి ‘ఆర్టిస్ట్’ మూవీతో మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే హీరో సంతోష్, హీరోయిన్ క్రిషేకకు కూడా పేరొస్తుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 21న మా మూవీని రిలీజ్ చేస్తున్నాం”అని అన్నారు. హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ – “ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు మా డైరెక్టర్. సమాజంలో ఉన్న ఒక సమస్యను ఈ సినిమాలో చూపించాడు. ఆ సమస్య పాతదే అయినా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి”అని తెలిపారు. డైరెక్టర్ రతన్ రిషి మాట్లాడుతూ “ఇదొక సైకో థ్రిల్లర్ మూవీ. ఇందులో సస్పెన్స్, భయం, కామెడీ, రొమాన్స్ వంటి అన్ని అంశాలుంటాయి. ఒక ఎమోషన్ మీద కథ వెళ్తుంటుంది. సినిమా చివరి 20 నిమిషాలు హైలైట్‌గా ఉంటుంది. చివరకు ఒక మంచి ఫీల్‌తో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ క్రిషేక పటేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ బసంత్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, తాగుబోతు రమేష్, రాంబాబు గోసాల, స్నేహ మాధురిశర్మ, వెంకీ తదితరులు పాల్గొన్నారు.
సరికొత్త సైకో థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -